రావు రమేశ్ క్యారెక్టర్‌కు గేట్లు ఓపెన్ చేశాడు!
on Dec 21, 2019
మారుతి డైరెక్ట్ చెయ్యగా డిసెంబర్ 20న విడుదలైన 'ప్రతిరోజూ పండగే' మూవీలో హీరో సాయిధరం తేజ్ తండ్రిగా, సత్యరాజ్ కొడుకుగా రావు రమేశ్ ప్రదర్శించిన నటనకు సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి. ఆయన పాత్రను ప్రేక్షకులు విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. చక్కని టైమింగ్‌తో ఆయన చెప్పిన డైలాగ్స్, ఆయన బాడీ లాంగ్వేజ్ ప్రేక్షకుల్ని బాగా అలరించాయి. ఆ క్యారెక్టర్‌ను ఒక ప్రత్యేక శ్రద్ధతో డైరెక్టర్ మారుతి డిజైన్ చేసినట్లు అనిపిస్తుంది. ఇదే విషయాన్నిమారుతిని అడిగితే, తను రాసుకున్న క్యారెక్టర్‌ను రావు రమేశ్ తన నటనతో మరో స్థాయికి తీసుకువెళ్లారని చెప్పాడు.
"ఈ కథలో హీరో ఫాదర్‌గా రావు రమేశ్ గారినే ఊహించుకున్నాను. కొత్తగా ఒక కంపెనీ పెట్టుకొన్న ఒక ఎన్నారై పర్సన్ ఎలా బిహేవ్ చేస్తాడనే దానిపై ఆ క్యారెక్టర్‌ను డిజైన్ చేశాను. ఆ క్యారెక్టర్ చెప్పినప్పుడు, 'ఇంత పెద్ద క్యారెక్టర్ ఇస్తున్నారు, మరి హీరో గారికి ఓకేనా?' అని రావు రమేశ్ అడిగారు. 'హీరోగారికీ, అందరికీ చెప్పిన తర్వాతే మీకొచ్చి చెప్పానండీ' అన్నాను. 'క్యారెక్టర్ చాలా బాగుందండీ. నేను చేస్తానండీ' అన్నారాయన. ఈ సినిమా కోసం ఆయనను 28 రోజులు వాడుకున్నాం. అన్ని రోజులూ సెట్స్‌పై మాకొక పండగ లాగే గడిచింది. కొంత మంది బాడీ లాంగ్వేజ్ చూసి నేను ఎగ్జైట్ అవుతుంటాను. నేను రాసుకొనేటప్పుడు సగమే ఉంటుంది. సెట్‌కు వెళ్లాక అది ఎన్హాన్స్ అవుతుంది. వాళ్ల పర్ఫార్మెన్స్ చూశాక ఎగ్జైట్ అవుతుంటాను.
'ప్రేమ కథాచిత్రం'లో సప్తగిరిది మొదట పెద్ద క్యారెక్టర్ అనుకోలేదు. అతడిని పిలిచాను.. వచ్చాడు. రెండు డైలాగులు చెప్పాక అతని టైమింగ్ నేననుకున్న దానికి వేరేగా అనిపించింది. 'డార్లింగ్.. ఈ సినిమాతో నీకు గేట్లు ఓపెన్ చేస్తున్నా' అని చెప్పాను. అలాంటోడ్ని దెయ్యం కొడితే ఎలా ఉంటుందనే ఆలోచనతో మాగ్జిమం అతడి చేత కామెడీ చేయించాను. అతని క్యారెక్టర్‌కు లిమిటేషన్స్ ఉండవు. అదే ప్రవీణ్ క్యారెక్టర్‌కు పరిమితులుంటాయి. అలాగే.. 'భలే భలే మగాడివోయ్' మూవీలో నాని క్యారెక్టర్‌కు కూడా లిమిటేషన్స్ ఉండవు. ఆయన దేన్నయినా మర్చిపోతుంటాడు. అన్ని ఎమోషన్స్ అందులోనే ఉంటుంటాయి. ఒక క్యారెక్టర్‌కు ఒక మంచి ఆర్టిస్టు దొరికితే, ప్లే చెయ్యడానికి ఎక్కువ స్కోపు దొరుకుతుంది. అలాగే 'మహానుభావుడు'లో ఓసీడీ అనే డిజార్డర్ ఉన్న యువకుడిగా శర్వానంద్ క్యారెక్టర్‌కు లిమిటేషన్స్ కనిపించవు. అతనిలోని క్లీన్లీ్నెస్ను పీక్‌లో చూపించవచ్చు. ప్రేక్షకుండి నేను ఏ కోణంలో చూస్తున్నానో, ఆ కోణంలోనే ఆ క్యారెక్టర్‌ను ఫాలో అవమని చెప్తుంటా. ఈ సినిమాలో రావు రమేశ్ క్యారెక్టర్ అలాగే పండింది. దీనికి ఆయన నటన బాగా దోహదం చేసింది" అని చెప్పుకొచ్చాడు మారుతి.