బికినీలో కాజల్ అందాల విందు
on Dec 23, 2019
తెలుగు తెర చందమామ కాజల్ అగర్వాల్ ప్రేక్షకులకు ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. ఇదొక స్వీట్ షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే... బికినీ ఫోటోలతో సోషల్ మీడియాలో కాజల్ చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. ఈ మధ్యకాలంలో సినిమాల్లోనూ ఎప్పుడూ ఈ స్థాయిలో అందాలు చూపించలేదు. అందువల్ల.... ఇటు ఇండస్ట్రీలోనూ, అటు ప్రేక్షకుల్లోనూ ఇది హాట్ టాపిక్.
అసలు ఏం జరిగిందంటే? మూడు రోజుల క్రితం కాజల్ తల్లి పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఫ్యామిలీ అంతా కలిసి మాల్దీవులు వెళ్లారు. అక్కడి సముద్ర తీరంలో, స్విమ్మింగ్ పూల్ లో బికినీలతో దిగిన ఫోటోలు ఎప్పటికప్పుడు కాజల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. సినిమాల్లోనూ ఎప్పుడూ ఆమె బికినీ వేసుకుని అందాలు చూపించినది లేదు. దాంతో కాజల్ ఎందుకు ఇలా చేస్తుందని కొందరు అనుకుంటుంటే... బికినీలో కాజల్ అందాలు చూడతరమా అని చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు. 'ఖైదీ నంబర్ 150' తర్వాత దాదాపుగా ప్రతి సినిమాలోనూ కాజల్ పద్ధతిగా నటించింది. నేను రాజు నేనే మంత్రి, వివేకం సినిమాల్లో అయితే చీరల్లో మాత్రమే కనిపించింది. కవచం, అ! సినిమాల్లో మోడ్రన్ డ్రెస్సుల్లో కనిపించినా... ఎక్స్ పోజింగ్ చేయలేదు. అటువంటిది ఉన్నట్టుండి ఒక్కసారిగా అందాలు అరబోయడంతో హాట్ టాపిక్ అయింది.
ప్రస్తుతం కాజల్ చేతిలో పెద్ద సినిమాలు కూడా ఏవీ లేవు. కమల్ హాసన్ పక్కన 'భారతీయుడు 2'లో నటిస్తోంది. మంచు విష్ణుకు అక్కగా 'మోసగాళ్లు' సినిమాలో నటిస్తోంది. కథానాయికగా ఈ రెండు అనేక అవకాశాలు తీసుకువచ్చే సినిమాలు కాదు. ఎందుకంటే... కమల్ చాలా సీనియర్ హీరో. మంచు విష్ణు సినిమాలో అక్క క్యారెక్టర్ చేస్తోంది. యంగ్ హీరోల పక్కన అవకాశాలు రావాలంటే కొంచెం స్క్రీన్ షో చేయాలని ఫిక్స్ అయ్యిందేమో.