సాయిపల్లవి నడుస్తుంటే పక్కన వెన్నెల తిరుగుతున్నట్లు ఉంటుంది!
on Jun 16, 2022

సాయిపల్లవిని పొగడ్తలతో ముంచేశాడు రానా దగ్గుబాటి. ఆ ఇద్దరూ కలిసి నటించిన సినిమా 'విరాటపర్వం'. వేణు ఊడుగుల డైరెక్ట్ చేసిన ఈ మూవీని డి. సురేష్ బాబు సమర్పణలో ఎస్.ఎల్.వి. సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఈ సినిమా జూన్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. బుధవారం రాత్రి జరిగిన ప్రి రిలీజ్ ఈవెంట్‌లో సాయిపల్లవిని 'లేడీ పవర్‌స్టార్' అంటూ స్క్రీన్‌పై సంబోధించారు. ఈవెంట్ ఆద్యంతం సాయిపల్లవి నామజపంతో ఆడిటోరియం హోరెత్తిపోయింది. రానా మాట్లాడుతున్నప్పుడు కూడా ఆమె అభిమానులు కేకలు పెడుతూనే ఉన్నారు. అందుకే "ఇక్కడున్న సాయిపల్లవిగారి ఫ్యాన్స్ అందరికీ వెల్‌కమ్" అని రానా చెప్పాడు.
దాంతో కొంతసేపటి దాకా ఆమె ఫ్యాన్స్ గోల గోల చేశారు. దాన్ని నవ్వుతూ ఎంజాయ్ చేసిన రానా, "అదీ చూశారా.. పవర్ ఆఫ్ సాయిపల్లవి" అన్నాడు. ఆ తర్వాత, "ఒక భయంకరమైన బ్యాక్‌డ్రాప్‌లో ఒక అందమైన లవ్ స్టోరీ చేశారు డైరెక్టర్ వేణు. ఆ స్టోరీని నా దగ్గరకు తీసుకువచ్చిన ఆయనకు థాంక్స్. ఆ భయంకరమైన బ్యాక్‌డ్రాప్‌లో బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అన్నాను కదా.. ఆ బ్యూటీ సాయిపల్లవి. ఆవిడ నడుస్తుంటే చాలు.. పక్కన వెన్నెల తిరుగుతున్నట్లే ఉంటుంది. ఈ సినిమాలో ఎవరు ఉన్నా లేకపోయినా సాయిపల్లవి గారు లేకపోతే ఈ సినిమా ఉండేది కాదు. మీతో వర్క్ చేయడం నాకు లభించిన గౌరవం సాయిపల్లవీ." అని ఆమెను హత్తుకొని చెప్పాడు.
ఈ మూవీలో సాయిపల్లవి తల్లితండ్రులుగా ఈశ్వరీరావు, సాయిచంద్ నటించగా, రానా తల్లిగా జరీనా వహాబ్ నటించారు. నవీన్‌చంద్ర, ప్రియమణి, నందితా దాస్, రాహుల్ రామకృష్ణ ఇతర కీలక పాత్రధారులు. సురేశ్ బొబ్బిలి సంగీతం అందించగా, డానీ సాంచెజ్ లోపెజ్, దివాకర్ మణి సినిమాటోగ్రాఫర్స్‌గా వర్క్ చేశారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



