సాయి పల్లవికి నేషనల్ అవార్డు గ్యారెంటీ
on Jun 16, 2022

సాయి పల్లవి చూడటానికి ఎంత నేచురల్ గా ఉంటుందో.. ఆమె నటన కూడా అంతే నేచురల్ గా ఉంటుంది. 'ఫిదా', 'లవ్ స్టోరీ', 'శ్యామ్ సింగ రాయ్' ఇలా ఏ సినిమా చేసిన తన నటనతో కట్టిపడేస్తుంది. ఇంతలా నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సాయి పల్లవి.. 'విరాట పర్వం' సినిమాతో నేషనల్ అవార్డు అందుకోవడం గ్యారెంటీ విక్టరీ వెంకటేష్ అంటున్నారు.
రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందిన సినిమా 'విరాట పర్వం'. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా రేపు(జూన్ 17న) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ జరగగా.. వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన సాయి పల్లవిపై ప్రశంసలు కురిపించారు.
'మారదులే ఈ దోపిడి దొంగల రాజ్యం మారదులే' అంటూ విరాటపర్వంలోని రానా డైలాగ్ తో వెంకటేష్ స్పీచ్ స్టార్ట్ చేశారు. "ఏంటి రానా ఈ ఫైర్. రానా ఫస్ట్ ఫిల్మ్ 'లీడర్' నుంచి ఏ సినిమా తీసుకున్నా సినిమాలో తన పాత్ర కోసం ఫుల్ ఎఫర్ట్స్ పెడతాడు. రానా ఎప్పటికైనా గొప్ప స్థాయికి వెళ్తాడు. డైరెక్టర్ వేణు ద్వారా మన తెలుగు ఇండస్ట్రీకి మరో హానెస్ట్ ఫిల్మ్ మేకర్ వచ్చాడు. ఈ సినిమాలోని రైటింగ్, విజువల్స్ అన్ని బాగుంటాయి. ముఖ్యంగా యాక్టర్స్ అంతా అవార్డు విన్నింగ్ పర్ఫామెన్స్ లు ఇచ్చారు. ఇక మన వెన్నల సాయి పల్లవి.. ఆ నవ్వు చాలు. ఎంత క్యూట్ గా ఉంటుంది. ఇది ఆమె కెరీర్ లో ఉత్తమ చిత్రాలలో ఒకటిగా నిలిచిపోతుంది. ఈ సినిమాతో ఆమె నేషనల్ అవార్డు సాధిస్తుందని నాకు అనిపిస్తుంది. వెన్నెల పాత్రలో ఆమె జీవించింది. ఇలాంటి సినిమాలు ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను" అని వెంకటేష్ అన్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



