సేవ్ ప్లానెట్ అంటున్న అనుపమ పరమేశ్వరన్
on Jun 16, 2022
.webp)
అనుపమ పరమేశ్వరన్ ఒక మంచి నటిగా అందరికీ సుపరిచితురాలు. మలయాళంలో "ప్రేమమ్ " మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి చాలా తక్కువ టైములో మంచి ఫేమ్ తెచ్చుకుంది. టాలీవుడ్ లో "అ ఆ " మూవీతో ఎంట్రీ ఇచ్చింది. తర్వాత శతమానంభవతి, ఉన్నది ఒకటే జిందగీ, కృష్ణార్జున యుద్ధం మూవీలో చేసి తెలుగు ఆడియన్స్ కి మరింత దగ్గరయ్యింది. తనకు ఎదురైన ఎలాంటి సంఘటనైనా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూ ఉంటుంది కూడా. ఐతే లేటెస్ట్ గా ఒక ఫోటో తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. రోడ్ల నిండా నిండిపోయిన చెత్త ఫోటో అది. ఆవులు పక్కన ఆ చెత్తను తింటూ ఉంటాయి. చాలా కూల్ గా ఉండే అనుపమ ఈ పిక్ తో పాటు చాలా ఘాటైన కామెంట్ కూడా పెట్టింది. " నా ఉదయం ఇలానే స్టార్ట్ అవుతుంది..భూమిని ఇలా చెత్తచెత్తగా చేస్తూ ప్రకృతిని నాశనం చేస్తున్న వారిని చూస్తుంటే సిగ్గేస్తోంది" సేవ్ ఎర్త్, సేవ్ ప్లానెట్ అనే హాష్ టాగ్స్ పెట్టి పోస్ట్ చేసింది.

ఇలా పోస్ట్ చేసే బదులు క్లీన్ చేస్తూ జనాలకు అవగాహనా కల్పించే వీడియో చేయొచ్చుగా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అనుపమ చేసిన ఈ పోస్ట్ తో జిహెచ్ఎంసీ అడ్డంగా బుక్ అయ్యింది. ఈమె పెట్టిన వీడియో వైరల్ అయ్యేసరికి జిహెచ్ఎంసీ ట్విట్టర్ అకౌంట్ నుంచి ఆమెకు ఒక రిప్లై వచ్చింది. మీ పెట్టిన ఈ పోస్ట్ ఏ ప్రాంతానికి చెందిందో చెప్తే సమస్య పరిష్కరిస్తాం" అని రిప్లై ఇచ్చారు.. జిహెచ్ఎంసీకి అది ఏ ప్రాంతమో కూడా తెలీదా అంటూ నెటిజన్స్ మండిపడుతున్నారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అయ్యేసరికి "మీకు హ్యాట్సాఫ్ "అంటూ అనుపమను విష్ చేస్తున్నారు నెటిజన్స్. హలో గురు ప్రేమ కోసమే, రాక్షసుడు లాంటి మూవీస్ తో మంచి నటన కనబరిచే కేరక్టర్స్ లో చేసిన అనుపమ తాజాగా 18 పేజెస్, కార్తికేయ - 2 మూవీస్ తో అలరించబోతోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



