రానా ఎంగేజ్‌మెంట్ జరగలేదు!
on May 21, 2020

రానాకు కాబోయే శ్రీమతి మిహీకా బజాజ్ తల్లిదండ్రులు సురేష్ బజాజ్, బంటీ బజాజ్ బుధవారం సాయంత్రం తమ ఇంటికి వచ్చారనీ, అయితే అందరూ అనుకుంటున్నట్లు నిశ్చితార్థం జరగలేదని రానా తండ్రి డి. సురేష్ బాబు తెలిపారు. హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్ళికి ముందు వధూవరుల తలిదండ్రులు ఒకరి ఇంటికి ఒకరు వెళతారు. ముందు అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయి ఇంటికి వచ్చి వెళ్తారు. తర్వాత అమ్మాయి ఇంటికి అబ్బాయి తల్లిదండ్రులు వెళ్తారు. బుధవారం ఇంకా తల్లి తండ్రులు తమ ఇంటికి వచ్చారని సురేష్ బాబు అన్నారు. టీ తాగి కాసేపు మాట్లాడుకుని వెళ్లారట. ఇంకా నిశ్చితార్థం ఎప్పుడు చేయాలి అనేది ఖరారు చేయలేదన్నారు.
నిశ్చితార్థం, వివాహం ముహూర్తాలు ఇంకా ఖరారు చేయనప్పటికీ... శీతాకాలంలో పెళ్లి చేయాలని అనుకుంటున్నట్లు సురేష్ బాబు స్పష్టం చేశారు. ప్రస్తుతం కరోనా క్రైసిస్ కొనసాగుతున్న తరుణంలో ముహూర్తాలు ఖరారు చేయడానికి ఇంకా చాలా సమయం పడుతుందని ఆయన తెలిపారు. ఒకసారి అన్ని ఖరారు అయితే అధికారికంగా వెల్లడిస్తామన్నారు. అదీ సంగతి!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



