విమర్శలు వచ్చినా త్రిష వెనకడుగు వేయలేదు?
on May 21, 2020
ఇటీవల కథానాయిక త్రిషపై తెలుగు సినిమా ప్రేక్షకులు కాస్త ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెపై విమర్శలూ వచ్చాయి. 'మీ దృష్టిలో ఇండియాలో బెస్ట్ యాక్టర్స్ ఎవరు?' అని త్రిషను ఒక అభిమాని అడిగితే... ఆమె తెలుగు హీరోలలో ఒక్కరి పేరు కూడా చెప్పలేదు. తమిళం నుండి కమల్ హాసన్, హిందీ నుండి ఆమిర్ ఖాన్, మలయాళం నుండి మోహన్ లాల్ పేర్లు చెప్పింది. కథానాయికగా త్రిష అగ్రస్థానానికి చేరుకోవడానికి కారణమైన తెలుగులో ఎంతో ప్రతిభ ఉన్న కథానాయకులు విస్మరించిందని ఆమెను విమర్శించారు. ట్రోల్స్ వచ్చాయి. అయినా త్రిష ఏమాత్రం వెనుకడుగు వేయలేదు. ఈ రోజు మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెప్పారు. ఆ శుభాకాంక్షలలో మరోసారి అతడిని తన అభిమాన కథానాయకుడిగా పేర్కొన్నారు.
"మంచి మనిషి, నాకు తెలిసిన బెస్ట్ యాక్ట్ కి హ్యాపీ బర్త్ డే" అని మోహన్ లాల్ తో దిగిన ఫొటోను త్రిష సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఎన్ని విమర్శలు వచ్చినా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి ఏమాత్రం వెనుకడుగు వేయని త్రిషను అభినందించి తీరాలి. అయితే తెలుగు ప్రేక్షకుల నుండి కొన్ని రోజులు ఆమె వ్యతిరేకత ఎదుర్కొనడం ఖాయంగా కనిపిస్తోంది.