యాక్సిడెంట్ నుంచి కోలుకున్నాక రంభ, పిల్లలు.. ఇలా ఉన్నారు!
on Nov 7, 2022

నటి రంభ ఇటీవల కెనడాలో కారు ప్రమాదానికి గురై, హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంది. యాక్సిడెంట్‌కు గురైన కారు ఫొటోలు హృదయాన్ని కదిలించేశాయి. కారు ఒక వైపు బాగా ధ్వంసం అయ్యింది. ఆ ఫొటోలు చూసిన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. పిల్లలను తీసుకొని కారులో రంభ స్కూల్ నుంచి ఇంటికి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. లేటెస్ట్‌గా రంభ తన పిల్లల వీడియోను షేర్ చేసింది. అందులో వారు బాగానే ఉన్నారు.
రంభ, ఆమె పిల్లలు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. వీడియోను షేర్ చేయడం ద్వారా, తన పిల్లలు పూర్తిగా క్షేమంగా ఉన్నారని, వారి గురించి ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదనీ, ఇప్పుడు మామూలుగా రోజులు గడుపుతున్నారనే విషయాన్ని చూపించింది. ఈ వీడియోలో, ఆమె పిల్లలు చాలా సరదా మూడ్‌లో ఉన్నారు. ఆడుతూ, గెంతుతూ హుషారుగా ఉన్నారు. పిల్లల వీడియోను పంచుకుంటూ, రంభ "ఇది నా ఇంట్లో తీసినది. పిల్లలు వారి సాధారణ రూపంలోకి వచ్చారు. వారిని సాధారణ జీవితానికి తీసుకురావడానికి నా వంతు ప్రయత్నం చేస్తున్నా. త్వరగా కోలుకోవడానికి మ్యూజిక్, డాన్స్ ఎంతో హెల్ప్ చేస్తాయి." అని చెప్పింది.
యాక్సిడెంట్ నుంచి కోలుకొని ఇంటికి వచ్చిన వెంటనే రంభ ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో "కారు ప్రమాదం నుంచి మేం త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన అభిమానులు, స్నేహితులు, కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు. నేను, నా పిల్లలు ఇప్పుడు క్షేమంగా ఉన్నాం. మా కోసం ప్రార్థిస్తూ ఉండండి. మీ అందరి నుండి నేను పొందుతున్న ఆనందాన్ని చెప్పడానికి నా దగ్గర మాటలు లేవు. మేమంతా ఇంట్లో ఉన్నాం, నా పిల్లలు.. ముఖ్యంగా నా కూతురు సాషా కూడా క్షేమంగా ఉంది." అని చెప్పుకొచ్చింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



