ఫేస్ బుక్ రిక్వెస్ట్‌తో మొదలైన స్నేహం ప్రేమగా మారింది!
on Nov 7, 2022

ఇవాళ రిషబ్ శెట్టికి సౌత్ ఇండియా అంతటా చాలా మంది అభిమానులున్నారు. 'కాంతార' అనే ఒక్క సినిమాతో రిషబ్ జీవితం మారిపోయింది. రోజురోజుకు మంచి రెస్పాన్స్‌ని అందుకుంటూ థియేటర్లలో సక్సెస్ ఫుల్ జర్నీ కొనసాగిస్తోంది 'కాంతార.' గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాలకు తీసుకొచ్చారు. ఇక్కడ కూడా ఈ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్టయ్యింది. అయితే 'కాంతార' చుట్టూ వివాదాలు చుట్టుముట్టాయి. తాజాగా రిషబ్ తన కుటుంబంతో ఉన్న ఫోటోలను పంచుకున్నాడు.
భార్య ప్రగతి, పిల్లలు రన్విత్ శెట్టి మరియు రాధ్యా శెట్టిలతో కలిసి ఉన్న ఫోటోను పంచుకున్నాడు రిషబ్. ఆ ఫోటో కొద్దిసేపటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫొటోలు చూసిన అభిమానులు ఆ ఫ్యామిలీ ఎంత ముద్దుగా ఉందో అంటున్నారు. ఒక సినిమాకి సంబంధించిన ఈవెంట్‌లో తొలిసారిగా ప్రగతిని కలిశాడు రిషబ్. ఆ తర్వాత ఓ రోజు ఫేస్ బుక్ ద్వారా ప్రగతి నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ చూసాడు రిషబ్. తర్వాత ఇద్దరూ ఫేస్‌బుక్ ద్వారా చాలా సేపు మాట్లాడుకున్నారు. స్నేహితులుగా ఉన్న రిషబ్, ప్రగతి అనతికాలంలోనే ప్రేమలో పడ్డారు.
వీరి పెళ్లికి ప్రగతి తల్లిదండ్రులు మొదట అంగీకరించలేదు. అన్ని వ్యతిరేకతలను అధిగమించి వీరిద్దరూ 2017లో పెళ్లి చేసుకున్నారు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన ప్రగతి గతంలో సినిమాల్లో కాస్ట్యూమ్ డిజైనర్‌గా వర్క్ చేసింది. 'బెల్ బాటమ్', 'కిరిక్ పార్టీ', 'గరుడగమన వృషభ వాహన' చిత్రాల ద్వారా రిషబ్ మంచి గుర్తింపు పొందాడు. స్వయంగా కథ రాసి, దర్శకత్వం వహించిన 'కాంతార' మూవీతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ చిత్రంలో రిషబ్‌కు జోడీగా సప్తమి గౌడ కనిపించింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



