హైదరాబాద్‌లో కనిపిస్తే యాసిడ్ పోసేస్తానని బెదిరించాడు!
on Nov 7, 2022

ఎస్తర్ అంటే తెలియదు కానీ 'భీమవరం బుల్లోడు' మూవీ హీరోయిన్ అంటే తెలిసిపోతుంది. ఈమెకు ఇండస్ట్రీలో ఆశించిన రీతిలో సక్సెస్ రాలేదు.. ఇలాంటి టైంలో సింగర్ నోయెల్ ని ప్రేమ వివాహం చేసుకున్న విషయం, పెళ్లయిన ఆర్నెల్లకే విడాకులు తీసేసుకున్న విషయం చాలామందికి తెలిసిందే. ఇక ఎవరి లైఫ్ లో వాళ్ళు బిజీ ఐపోయిన టైంలో ఈమె ఒక ఇంటర్వ్యూలో తన విడాకుల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.
విడాకుల తర్వాత నోయల్ తనని చెడుగా చిత్రీకరించి తానే చాలా బెస్ట్ అన్నట్టుగా ఒక హైప్ క్రియేట్ చేసాడని చెప్పింది. తర్వాత బిగ్ బాస్ హౌస్ కి వెళ్లి అక్కడ అందరి సింపతి సంపాదించాడని, నోయెల్ తన గురించి బాడ్ చేయడం వలన సోషల్ మీడియాలో తనను బాగా ట్రోల్ చేసేసారని తెలిపింది. అలా ట్రోల్ చేసిన ఒకతను తనకు వార్నింగ్ ఇచ్చాడని, హైదరాబాదులో కనుక తను కనిపిస్తే యాసిడ్ పోసేస్తానని బెదిరించాడని వెల్లడించింది ఎస్తర్.
"నోయల్ పైకి మంచిగా కనిపించినప్పటికీ ఆయనలో మరో కోణం దాగి ఉంది. పెళ్లయిన 16 రోజులకే తన నిజ స్వరూపం బయటపడటంతో అలాంటి వ్యక్తితో జీవితాంతం ప్రయాణం చేయడం కష్టం అని తెలుసుకుని తన నుంచి విడాకులు తీసుకున్నాను.. ఆయన చాలా సేఫ్ గేమ్ ఆడతాడు" అంటూ ఎస్తర్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



