'రామారావు ఆన్ డ్యూటీ' ఫస్ట్ డే కలెక్షన్స్.. ఇలా అయితే కష్టమే!
on Jul 30, 2022

ఎన్నో అంచనాలతో శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన మాస్ మహారాజ రవితేజ నటించిన 'రామారావు ఆన్ డ్యూటీ' మూవీ మొదటి షో నుంచే నెగటివ్ టాక్ సొంతం చేసుకుంది. అసలే ప్రేక్షకులు థియేటర్స్ కి అంతంత మాత్రంగా వస్తున్న ఈ సమయంలో, నెగటివ్ టాక్ కూడా తోడు కావడంతో 'రామారావు ఆన్ డ్యూటీ' ఫస్ట్ డే కలెక్షన్స్ పై తీవ్ర ప్రభావం పడింది.
ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం రవితేజ గత చిత్రాలు 'క్రాక్', 'ఖిలాడీ' మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.7.31 కోట్ల షేర్, రూ.4.84 కోట్ల షేర్ రాబట్టగా.. 'రామారావు ఆన్ డ్యూటీ' మాత్రం రూ.3.42 కోట్ల షేర్ తో సరిపెట్టుకుంది. ఈ సినిమా మొదటి రోజు నైజాంలో రూ.80 లక్షల షేర్, సీడెడ్ లో రూ.52 లక్షల షేర్, ఆంధ్రాలో 1.45 కోట్ల షేర్ రాబట్టింది. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి ఫస్ట్ డే రూ.2.82 కోట్ల షేర్(4.75 కోట్ల గ్రాస్) వసూలు చేసింది. రెస్టాఫ్ ఇండియా 25 లక్షలు, ఓవర్సీస్ లో 35 లక్షల షేర్ కలిపి.. వరల్డ్ వైడ్ గా ఫస్ట్ డే రూ.3.42 కోట్ల షేర్(5.95 కోట్ల గ్రాస్) రాబట్టింది అంచనా.
వరల్డ్ వైడ్ గా రూ.17.20 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన 'రామారావు ఆన్ డ్యూటీ'.. 18 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగింది. మొదటి రోజు 20 శాతం లోపే రికవరీ చేసిన ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కి ఇంకా 14.58 కోట్ల దూరంలో ఉంది. ఫస్ట్ వీకెండ్(మొదటి మూడు రోజులు)లో కనీసం 10 కోట్ల పైగా షేర్ రాబడితేనే ఈ సినిమా బయ్యర్లు నష్టాలను తప్పించుకునే అవకాశముంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



