బన్నీని పూర్తిగా మార్చేసిన హరీష్ శంకర్!
on Jul 30, 2022
.webp)
'పుష్ప: ది రైజ్'లో పుష్ప రాజ్ పాత్ర కోసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనని తాను మార్చుకున్న తీరు ఆకట్టుకుంది. ఆయన తన లుక్, గెటప్, మ్యానరిజమ్స్ తో అందరినీ మెప్పించాడు. అయితే ఇప్పుడు బన్నీని డైరెక్టర్ హరీష్ శంకర్ పూర్తిగా మార్చేశాడు. బన్నీ కొత్త లుక్ కి సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
'పుష్ప పార్ట్-1'తో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్నాడు బన్నీ. అందుకే ఆయన క్రేజ్ ని క్యాష్ చేసుకోవడానికి బడా బడా కంపెనీలు పోటీ పడుతున్నాయి. ప్రస్తుతం 'పుష్ప పార్ట్-2' కోసం సన్నద్ధమవుతున్న బన్నీ.. రీసెంట్ గా తొమ్మిది కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడానికి సైన్ చేసినట్లు తెలుస్తోంది. అందులో ఇప్పటికే నాలుగు బ్రాండ్లకు సంబంధించిన యాడ్స్ షూట్ పూర్తి కాగా, త్వరలో మరో ఐదు కంపెనీల యాడ్స్ షూట్ జరగనుందని సమాచారం.
.webp)
ఇదిలా ఉంటే బన్నీ నటిస్తున్న యాడ్స్ కి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ పని చేస్తుండటం విశేషం. త్రివిక్రమ్, హరీష్ శంకర్ వంటి వారు బన్నీ నటించే యాడ్స్ ని డైరెక్ట్ చేస్తున్నారు. ఓ పైపుల కంపెనీ యాడ్ కోసం బన్నీ లుక్ ని హరీష్ మార్చిన తీరు ఆకట్టుకుంటోంది. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో నోట్లో సిగార్ పెట్టుకొని బన్నీ స్టైలిష్ డాన్ లా కనిపిస్తున్నాడు. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఈ గెటప్ లో సినిమా పడితే కేక ఉంటుందని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



