త్వరలోనే హీరో రామ్ పెళ్లి.. వధువు ఎవరంటే?
on Jun 26, 2022
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్స్ లో ఒకడైన ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నాడని తెలుస్తోంది. తన చిన్ననాటి స్నేహితురాలిని ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నాడని న్యూస్ వినిపిస్తోంది.
'దేవదాస్'(2006) సినిమాతో టాలీవుడ్ కి హీరోగా పరిచయమైన రామ్ ఇప్పటిదాకా దాదాపు 20 సినిమాల్లో నటించి సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్నాడు. చాక్లెట్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్న 34 ఏళ్ళ రామ్ పెళ్లికి రెడీ అవుతున్నట్లు సమాచారం. తన చిన్ననాటి ఫ్రెండ్ తో లవ్ లో ఉన్నాడని, ఇరు కుటుంబసభ్యుల అంగీకారంతో త్వరలోనే వీరు వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతున్నారని తెలుస్తోంది. ఆగష్టులో నిశ్చితార్థం, నవంబర్ లో పెళ్లి జరగనున్నాయని అంటున్నారు.
కాగా రామ్ జులై 14న 'ది వారియర్' సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. లింగుస్వామి దర్శకత్వం వహించిన ఈ మూవీలో కృతి శెట్టి హీరోయిన్. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
