'సమ్మతమే'.. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్!
on Jun 26, 2022
ఈమధ్య కాలంలో చాలా సినిమాలు బ్రేక్ ఈవెన్ మార్క్ అందుకోవడానికి కష్టపడుతున్నాయి. కానీ 'సమ్మతమే' సినిమా మాత్రం కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అందుకుంది. ఈ మేరకు తాజాగా మేకర్స్ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు.
కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి జంటగా నటించిన సినిమా 'సమ్మతమే'. యూజీ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమాతో గోపినాథ్ రెడ్డి డైరెక్టర్ గా పరిచయమయ్యాడు. జూన్ 24న విడుదలైన ఈ మూవీ పర్లేదు అనే టాక్ తెచ్చుకుంది. అయితే కలెక్షన్స్ మాత్రం అంచనాలకు మించి ఉన్నాయని మేకర్స్ అంటున్నారు. మొదటి రోజుని మించి రెండో రోజు, రెండో రోజుని మించి మూడో రోజు కలెక్షన్స్ తో.. కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిందని తెలుపుతూ పోస్టర్ ను విడుదల చేశారు.
"థియేటర్ కి వచ్చి మూవీ చూసి ఆదరించిన ప్రతి ఒకరికి ధన్యవాదాలు" అంటూ ఆ పోస్టర్ ను సోషల్ మీడియాలో షేర్ చేశాడు హీరో కిరణ్.