'గంధర్వ' రిలీజ్ డేట్ మారింది
on Jun 26, 2022

'వంగవీటి', 'జార్జ్ రెడ్డి' చిత్రాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో సందీప్ మాధవ్ మరో ఆసక్తికరమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అదే 'గంధర్వ'. ఫన్నీ ఫాక్స్ ఎంటర్టైన్మెంట్స్, ఎస్.కె ఫిలిమ్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాతో అప్సర్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.
'గంధర్వ' సినిమాని జూలై 1న విడుదల చేస్తున్నట్లు గతంలో మేకర్స్ ప్రకటించారు. అయితే ఇప్పుడు విడుదల తేదీ మారింది. జూలై 8 న థియేటర్లలో విడుదల కాబోతుంది.
గాయత్రి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో శీతల్, సాయి కుమార్, పోసాని, బాబు మోహన్ , సురేష్ తదితరులు నటించారు. ఈ సినిమాకు సంగీతం రాప్ రాక్ షకీల్ అందించారు. సినిమాటోగ్రఫీ జవహర్ రెడ్డి అందించగా ఎడిటర్ గా బసవా పైడి రెడ్డి వ్యవహరించారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



