తన హీరోయిన్లతో రామ్ బాక్సాఫీస్ క్లాష్!
on Jun 20, 2022

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని.. త్వరలో `ద వారియర్`గా ఎంటర్టైన్ చేయనున్నారు. కోలీవుడ్ కెప్టెన్ లింగుస్వామి తెరకెక్కించిన ఈ కాప్ డ్రామా.. జూలై 14న జనం ముందుకు రానుంది. కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ క్రేజీ ప్రాజెక్ట్.. తెలుగుతో పాటు తమిళంలోనూ ద్విభాషా చిత్రంగా వినోదాలు పంచనుంది.
ఇదిలా ఉంటే, `ద వారియర్` విడుదలవుతున్న వారంలోనే మరో రెండు చిత్రాలు రానున్నాయి. ఆ రెండింటిలోనూ గతంలో రామ్ కి జోడీగా నటించిన బ్యూటీస్ మెయిన్ లీడ్స్ గా నటించడం విశేషం. ఆ వివరాల్లోకి వెళితే.. `ద వారియర్` విడుదలైన తరువాతి రోజు అంటే జూలై 15న రితేశ్ రానా దర్శకత్వంలో లావణ్య త్రిపాఠి నటించిన `హ్యాపీ బర్త్ డే` విడుదల కానుండగా.. అదే రోజున నాగశేఖర్ డైరెక్షన్ లో తమన్నా భాటియా ఓ హీరోయిన్ గా యాక్ట్ చేసిన `గుర్తుందా శీతాకాలం` తెరపైకి వస్తోంది. అటు లావణ్య, ఇటు తమన్నా.. ఇద్దరు కూడా ఇదివరకు రామ్ సరసన కనువిందు చేశారు. `ఉన్నది ఒకటే జిందగీ`లో రామ్, లావణ్య జట్టుకట్టగా.. `ఎందుకంటే ప్రేమంట`లో రామ్, తమన్నా జతకట్టారు. ఏదేమైనా.. తన హీరోయిన్లతో జూలై రెండో వారంలో రామ్ కి క్లాష్ అనివార్యం అన్నమాట. మరి.. ఈ ముగ్గురిలో ఎవరెవరు విజయకేతనం ఎగురవేస్తారో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



