కియారా హ్యాట్రిక్ కొడుతుందా!
on Jun 20, 2022

`భరత్ అనే నేను`, `వినయ విధేయ రామ` చిత్రాలతో ఉత్తరాది సోయగంకియారా అద్వానీ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ప్రస్తుతం ఈ అమ్మడు.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది కూడా.
ఇదిలా ఉంటే, బాలీవుడ్ లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న కియారా అద్వాని.. ఈ శుక్రవారం (జూన్ 24) `జగ్ జగ్ జియో` చిత్రంతో పలకరించబోతోంది. వరుణ్ ధావన్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా గనుక హిట్ లిస్ట్ లో చేరితే.. కియారా ఖాతాలో హ్యాట్రిక్ పడ్డట్టే. ఇప్పటికే `షేర్షా` (ఓటీటీ హిట్), `భూల్ భులయ్యా 2`తో హిందీనాట రెండు వరుస విజయాలను అందుకుంది ఈ గ్లామరస్ యాక్ట్రస్. మరి.. `జగ్ జగ్ జియో`తో కియారా అద్వాని కెరీర్ లో తొలి హ్యాట్రిక్ క్రెడిట్ చేసుకుంటుందేమో చూడాలి.
కాగా, కియారా అద్వాని చేతిలో ప్రస్తుతం `గోవింద నామ్ మేరా` అనే హిందీ చిత్రం ఉంది. విక్కీ కౌశల్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాలో కియారాతో పాటు భూమి ఫెడ్నేకర్ మరో హీరోయిన్ గా నటిస్తోంది. ఇదే క్యాలెండర్ ఇయర్ లో ఈ కామెడీ థ్రిల్లర్ ఎంటర్టైన్ చేయనుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



