బన్నీకి సుక్కుతోనే ఫస్ట్ టైమ్!
on Jun 20, 2022

కథానాయకుడిగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ది దాదాపు 20 ఏళ్ళ చిత్ర ప్రయాణం. ఈ ప్రస్థానంలో పలువురి దర్శకులతో మళ్ళీ మళ్ళీ జట్టుకట్టారు బన్నీ. సుకుమార్, వీవీ వినాయక్, పూరీ జగన్నాథ్, గుణశేఖర్, త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఇలా స్టార్ కెప్టెన్స్ తో రెండు అంతకుమించి సినిమాలు చేశారాయన. అయితే, మూడేసి సినిమాలు చేసిన వైనం మాత్రం త్రివిక్రమ్, సుకుమార్ కే పరిమితం. `జులాయి`, `సన్నాఫ్ సత్యమూర్తి`, `అల వైకుంఠపురములో`- ఇలా త్రివిక్రమ్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ కొట్టిన అల్లు అర్జున్.. `ఆర్య`, `ఆర్య 2`, `పుష్ప - ద రైజ్`తో సుకుమార్ కాంబినేషన్ లోనూ అదే బాట పట్టారు.
కట్ చేస్తే.. సుకుమార్ తోనే త్వరలో `పుష్ప` రెండో భాగం `పుష్ప - ద రూల్` కోసం మరోసారి జట్టుకట్టనున్నారు బన్నీ. ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. ఒక దర్శకుడితో వరుసగా రెండు సినిమాలు చేయడం బన్నీ కెరీర్ లో ఇదే మొదటిసారి. అంతేకాదు.. ఒక దర్శకుడితో అల్లు అర్జున్ నాలుగోసారి కలిసి పనిచేయనుండడం కూడా సుక్కు విషయంలోనే ఫస్ట్ టైమ్. మరి.. తొలిసారిగా ఒకే కెప్టెన్ తో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేయడమే కాకుండా, నాలుగోసారి జట్టుకడుతున్న బన్నీ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాలి.
కాగా, జూలైలో రెగ్యులర్ షూటింగ్ కి వెళ్ళనున్న `పుష్ప - ద రూల్`.. 2023 వేసవికి వినోదాలు పంచనుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



