సుమంత్ రెండో పెళ్లిపై వర్మ రియాక్షన్.. నీకింకా బుద్ధి రాలేదా?
on Jul 28, 2021
హీరో సుమంత్ రెండో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిన సంగతి తెలిసిందే. పవిత్ర అనే యువతిని సుమంత్ పెళ్లాడుతున్నాడు. ప్రస్తుతం వీరి వెడ్డింగ్ కార్డు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సుమంత్ రెండో పెళ్లి న్యూస్ రావడంతో నెటిజన్లు ఆయనకు విషెస్ చెబుతున్నారు. అయితే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మాత్రం తనదైన శైలిలో భిన్నంగా స్పందించాడు. నీకు ఇంకా బుద్ధి రాలేదా అంటూ సుమంత్ ని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశాడు.
సుమంత్ 2004లో 'తొలిప్రేమ' హీరోయిన్ కీర్తిరెడ్డిని వివాహం చేసుకున్నాడు. అయితే ఇరువురి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తి.. పెళ్లయిన రెండేళ్లకే విడాకులు తీసుకున్నారు. అప్పట్నుంచి ఒంటరిగా జీవిస్తూ వస్తున్న సుమంత్.. ఇంత కాలానికి రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు. అయితే ఈ న్యూస్ ఆర్జీవీకి చేరడంతో ట్విట్టర్ వేదికగా ఆయన ఘాటుగా స్పందించాడు. "ఒకసారి అయ్యాక కూడా నీకింకా బుద్ధి రాలేదా సుమంత్?.. నీ ఖర్మ.. ఆ పవిత్ర ఖర్మ.. అనుభవించండి" అంటూ ట్వీట్ చేశాడు.
కాగా సుమంత్.. ఆర్జీవీ దర్శకత్వంలో రూపొందిన 'ప్రేమ కథ' సినిమాతో టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అప్పటి నుంచి సుమంత్, ఆర్జీవీ మధ్య ఫ్రెండ్ షిప్ ఉంది. ఆ చనువు కొద్ది ఆర్జీవీ అలా ట్వీట్ చేసుంటాడని అంటున్నారు.