అమితాబ్‌తో ఆర్జీవీ హారర్ ఫిల్మ్!
on Jun 15, 2022

అమితాబ్ బచ్చన్‌తో రామ్‌గోపాల్ వర్మ తీసిన సినిమాల్లో హిట్లు, ఫ్లాపులు.. రెండూ ఉన్నాయి. 'సర్కార్' (2005) లాంటి బ్లాక్‌బస్టర్ మూవీతో వారి కాంబినేషన్ మొదలైంది. ఆ తర్వాత రమేశ్ సిప్పీ క్లాసిక్ యాక్షన్ మూవీ 'షోలే'ను తన స్టైల్‌లో 'రామ్‌గోపాల్ వర్మ కీ ఆగ్' పేరుతో రీమేక్ చేసి, అందులో గబ్బర్‌సింగ్‌గా అమితాబ్ బచ్చన్‌ను చూపించి, అందరి చేతా తిరస్కారానికి గురయ్యాడు ఆర్జీవీ.
'సర్కార్'కు సీక్వెల్‌గా తీసిన 'సర్కార్ రాజ్' కూడా హిట్టవగా, సర్కార్ 3 ఫ్లాపయింది. మరో సినిమా 'డిపార్ట్‌మెంట్' కూడా ఆశించిన రీతిలో ఆడలేదు. 'షోలే'ను 'రామ్‌గోపాల్ వర్మకీ ఆగ్'గా తీయడం తప్పేనని ఒకప్పుడు బిగ్ బి రిగ్రెట్ అయ్యారు కూడా.
కాగా, 'సర్కార్ 3' తర్వాత మరోసారి అమితాబ్, ఆర్జీవీ కలిసి పనిచేయబోతున్నారు. ఈసారి వారు ఓ హారర్ జానర్‌లో మూవీ చేయనున్నారు. ఈ విషయాన్ని ఆర్జీవీ స్వయంగా వెల్లడించారు. "అమితాబ్ బచ్చన్ గారితో సినిమా ప్లాన్ చేస్తున్నా. అది హారర్ జానర్. నవంబర్ లో స్టార్ట్ కావచ్చు." అని ఈరోజు ఓ మీడియా సమావేశంలో ఆయన చెప్పారు. కొంత కాలంగా తను తీస్తున్న సినిమాలతో విమర్శలనే ఎక్కువగా మూటగట్టుకున్న ఆర్జీవీ.. ఈ సినిమాతో ఎలాంటి పేరు తెచ్చుకుంటారో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



