చిరంజీవికి ఒకలా.. కమల్ హాసన్ కి మరోలా..!
on Jun 15, 2022

తమకు కలిసొచ్చిన తేదీల్లో మళ్ళీ మళ్ళీ అదృష్టాన్ని పరీక్షించుకోవడం.. చిత్ర పరిశ్రమలో షరా మూములే. లోక నాయకుడు కమల్ హాసన్, మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ ఏడాది ఇదే తరహాలో తమ లక్కీ డేట్స్ లో మరోసారి సందడి చేశారు. అయితే, చిత్రంగా చిరుకి డిజాస్టర్ క్రెడిట్ అవగా.. కమల్ హాసన్ కి మాత్రం మరో మెమరబుల్ హిట్ దక్కింది.
ఆ వివరాల్లోకి వెళితే.. 1988లో చిరంజీవికి ఇండస్ట్రీ హిట్ ని అందించిన సినిమా `యముడికి మొగుడు`. ఫాంటసీ సబ్జెక్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో పలు రికార్డులను భూస్థాపితం చేసింది. కట్ చేస్తే.. ఆ సినిమా విడుదలైన ఏప్రిల్ 29నే 34 ఏళ్ళ తరువాత మళ్ళీ `ఆచార్య`తో పలకరించారు చిరు. ఇందులో తన తనయుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు కూడా. అయితే, పేలవమైన కథ, కథనాలతో తయారైన ఈ సోషల్ డ్రామా.. మెగాస్టార్ బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచింది. ఇక కమల్ హాసన్ విషయానికి వస్తే.. `సాగర సంగమం` (1983) వంటి ఆల్ టైమ్ క్లాసిక్ విడుదలైన జూన్ 3న.. 39 ఏళ్ళ అనంతరం మళ్ళీ `విక్రమ్`తో జనం ముందుకొచ్చారు. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రంతో తన కెరీర్ లోనే హయ్యస్ట్ గ్రాసర్ సొంతం చేసుకున్నారు. మొత్తమ్మీద.. లక్కీడేట్స్ లో మరోసారి పలకరించిన చిరంజీవి, కమల్ హాసన్ కి విభిన్న ఫలితాలు దక్కాయన్నమాట.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



