Home

»

Latest News

సాయిప‌ల్ల‌వి చేసింది ఒక‌ డ్రాయింగ్ రూమ్ కామెంట్‌!

Jun 22, 2022 1:10PM

 

ఒక‌ప్పుడు క‌శ్మీరీ పండిట్లపై జ‌రిగిన హ‌త్యాకాండ‌ను, కొంత కాలం క్రితం వాహ‌నంలో ఆవును తోలుకుపోతున్న ముస్లింల‌పై జ‌రిగిన దాడిని పోల్చి చెప్పిన సాయిప‌ల్ల‌విపై సోష‌ల్ మీడియాలో విప‌రీత‌మైన ట్రోలింగ్ జ‌ర‌గ‌డం, ఆమెపై చ‌ర్య‌లు తీసుకోవాలంటూ కేసులు కూడా వేయ‌డం మ‌నం చూశాం. సాయిప‌ల్ల‌వి చేసిన కామెంట్ల‌ను అంత సీరియ‌స్‌గా తీసుకోవాల్సిన అవ‌స‌రం లేద‌నీ, ఆమె చేసింది డ్రాయింగ్ రూమ్ కామెంట్ లాంటిద‌నీ ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ అభిప్రాయ‌ప‌డ్డారు.

ఈనెల 23న విడుద‌ల‌వుతున్న త‌న సినిమా 'కొండా' ప్ర‌మోష‌న్‌లో భాగంగా తెలుగువ‌న్ చాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న, "సాయిప‌ల్ల‌వి ఒక యంగ్ గాళ్‌. హైలీ స‌క్సెస్‌ఫుల్ యాక్ట్రెస్‌. ఆ అమ్మాయి ఏదో గ‌బుక్కున ఏదో అంటే దాన్నంత సీరియ‌స్‌గా చేసి, ఎవ‌రో రెస్పెక్ట‌బుల్ పాలిటీషియ‌నో, ఇన్‌ఫ్లుయెన్స్ చేసే పొజిష‌న్‌లోనో ఉన్న‌ప్పుడు మాట్లాడిన‌దాని స్థాయిలో ప్ర‌చారం ఇవ్వ‌డం క‌రెక్ట్ కాదు. ఎవ‌రో డ్రాయింగ్ రూమ్ కామెంట్ లాంటిది చేస్తే, దాన్నంత చేయాల్సిన ప‌నిలేదు." అని చెప్పారు.

క‌శ్మీరీ పండితుల‌ను చంప‌డానికీ, ముస్లిమ్స్‌ను టార్గెట్ చేయ‌డానికీ కంపేర్ చేయ‌డ‌మ‌నే సౌండ్ వ‌చ్చిన‌దాని ఫ‌లితం ఇది అని ఆయ‌న‌న్నారు. "సాయిప‌ల్ల‌వి వ‌య‌సు, ఎక్స్‌పోజ‌ర్‌, నాలెడ్జ్‌ను దృష్టిలో పెట్టుకుంటే.. దాన్నంత పెద్ద‌ది చేయడంలో అర్థం లేదు. కేవ‌లం ఆ అమ్మాయి సెల‌బ్రిటీ కాబ‌ట్టి చేస్తున్నారనేది నా ఫీలింగ్‌. ప్ర‌తి ఒక్క‌రూ స్పందిస్తారు. వాళ్ల పాపులారిటీని బ‌ట్టి ఎంత‌మంది వింటార‌నేది ఉంటుంది." అని ఆర్జీవీ అభిప్రాయ‌ప‌డ్డారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com