మాస్ రోల్ లో మెగా మేనల్లుడు.. తలలు కోసి చేతికిస్తా నాయాలా!
on Jun 22, 2022
'ఉప్పెన' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ మొదటి సినిమాతోనే సంచలన విజయాన్ని అందుకున్నాడు. రెండో సినిమా 'కొండపొలం'తో కాస్త నిరాశపరిచిన వైష్ణవ్.. త్వరలో తన మూడో సినిమా 'రంగ రంగ వైభవంగా'తో అలరించడానికి సిద్ధమవుతున్నాడు. అయితే ఇప్పుడు ఈ యువ హీరో తన నాలుగో సినిమా కోసం మాస్ అవతారమెత్తుతున్నాడు.
వైష్ణవ్ తేజ్ నాలుగో సినిమా ప్రకటన గతంలోనే వచ్చిన సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి శ్రీకాంత్ రెడ్డి దర్శకుడు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్ తో పాటు, అనౌన్స్ మెంట్ వీడియోను రిలీజ్ చేశారు. వైష్ణవ్ మాస్ లుక్ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా వీడియోలో "ఈడ ఉండేడిది రాముడు కాదప్ప.. ఆ రావణుడే కొలిసే రుద్ర కాళేశ్వరుడు. తలలు కోసి చేతికిస్తా నాయాలా" అంటూ వైష్ణవ్ చెప్పిన డైలాగ్ పవర్ ఫుల్ గా ఉంది. చూస్తుంటే ఇది విలేజ్ నేపథ్యంలో సాగే పక్కా మాస్ ఫిల్మ్ అనిపిస్తోంది. మరి మాస్ రోల్ తో వైష్ణవ్ ఏ స్థాయిలో మెప్పిస్తాడో చూద్దాం.
'పెళ్లి సందD' ఫేమ్ శ్రీలీల ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఈ సినిమాని 2023 సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు.