తమన్ బైలింగ్వల్స్.. ఫెస్టివల్ స్పెషల్స్!
on Jun 22, 2022
దక్షిణాదిన ప్రస్తుతం హవా సాగిస్తున్న యువ సంగీత దర్శకుల్లో తమన్ ఒకరు. తెలుగు, తమిళ్.. ఇలా రెండు భాషల్లోనూ స్వరకర్తగా దూసుకుపోతున్నారు తమన్. అంతేకాదు.. ఈ రెండు భాషల్లో తీస్తున్న బైలింగ్వల్స్ (ద్విభాషా చిత్రాలు)తోనూ బిజీగా ఉన్నారాయన.
ఇదిలా ఉంటే, రైట్ నౌ తమన్ చేతిలో రెండు బైలింగ్వల్స్ ఉండగా.. అవి రెండు కూడా ఫెస్టివల్స్ ని టార్గెట్ చేసుకోవడం విశేషం. ఆ వివరాల్లోకి వెళితే.. వరుస విజయాలతో మంచి ఊపులో ఉన్న కోలీవుడ్ స్టార్ శివ కార్తికేయన్ `ప్రిన్స్` పేరుతో తెలుగు, తమిళంలో ఓ సినిమా చేస్తున్నాడు. `జాతిరత్నాలు` ఫేమ్ అనుదీప్ డైరెక్ట్ చేస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ దీపావళి స్పెషల్ గా అక్టోబర్ లో సందడి చేయనుంది. మరోవైపు.. కోలీవుడ్ టాప్ స్టార్ విజయ్ తో తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి ఓ బైలింగ్వల్ తీస్తున్నాడు. తెలుగులో `వారసుడు`, తమిళంలో `వారిసు` పేర్లతో ఎంటర్టైన్ చేయనున్న ఈ భారీ బడ్జెట్ మూవీ 2023 పొంగల్ స్పెషల్ గా జనవరిలో తెరపైకి రానుంది. మరి.. ఫెస్టివల్ స్పెషల్స్ గా రాబోతున్న ఈ బైలింగ్వల్స్ (ప్రిన్స్, వారసుడు)తో తమన్ ఎలాంటి ఫలితాలను అందుకుంటాడో చూడాలి.