చెర్రీ తన మైనస్‌ని ప్లస్ చేసుకుంటాడా..?
on Nov 28, 2016

ఒకప్పుడు తెలుగు సినిమా మార్కెట్ అంటే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు అంతే. సినిమా బడ్జెట్లు, కలెక్షన్స్ కూడా ఆ స్థాయిలోనే ఉండేవి. అయితే ఇప్పుడు కాలం మారింది. తెలుగు సినిమా మార్కెట్ పరిధి కూడా పెరిగింది. తెలుగు సినిమా రాష్ట్రాలు దాటి ప్రపంచంలోని కొన్ని దేశాల్లో రిలీజ్ అవుతున్నాయి. అలా తెలుగు సినిమాకి ఓవర్సీస్ మార్కెట్ కీలకంగా మారింది. సినిమా అక్కడి వారికి నచ్చిందా..కలెక్షన్ల వర్షమే. అక్కడి వసూళ్లతోనే నిర్మాతకి సగం పెట్టుబడి వచ్చేస్తుంటుంది. అందుకే దర్శకనిర్మాతలు తమ సినిమాల్లో ఓవర్సీస్ జనాలకి నచ్చే అంశాలను చేరుస్తుంటారు.
మహేశ్ ఓవర్సీస్‌ను శాసిస్తుండగా మిగతా హీరోలు అతని దారిలో నడుస్తున్నారు. అయితే మెగాస్టార్ నటవారసుడిగా ఎంట్రీ ఇచ్చిన రామ్‌చరణ్ ఈ విషయంలో అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. అప్పుడెప్పుడో మగధీర తప్ప ఆయన సినిమాలేవీ అక్కడ చెప్పుకోదగ్గ వసూళ్లు సాధించలేదు. దీనిపై ఫోకస్ చేసిన చెర్రీ తన రీసెంట్ మూవీ "ధృవ" తో ఈ లోటును పూడ్చుకోవాలని చూస్తున్నాడట. ధృవ నిర్మాతలకు ఓవర్సీస్‌లో డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఉండటంతో అక్కడ ప్రీమియర్లు ఏర్పాటు చేసి క్రేజ్ తీసుకురావాలని ప్లాన్ వేశాడు మెగా పవర్‌స్టార్. మరి అతని స్కెచ్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో..!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



