సమంత పెళ్లికి 'రెడ్' సిగ్నల్
on Nov 29, 2016

నాగచైతన్య - సమంతల పెళ్లికి రంగం సిద్దం అవుతోంది. వీళ్లిద్దరికీ ఇప్పటికే నిశ్చితార్థం జరిగిపోయిందన్న పుకార్లు ఎక్కువయ్యాయి. పెళ్లి మాత్రం ఆగస్టులో ఉండొచ్చని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. వీళ్లిద్దరి పెళ్లికి చైతూ ఇంట్లో వాళ్లు ఎప్పుడైతే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారో.. అప్పటి నుంచి ఈ ప్రేమ జంట మరింత ఓపెన్ అయిపోయింది. వీళ్లిద్దరూ తీయించుకొన్న ఫొటోల్ని సోషల్ మీడియాలో తరచూ అప్‌లోడ్ చేస్తున్నారు. సమంత కూడా.. ఇప్పుడు చైతూ ఇంట్లోనే ఉంటున్నట్టు వినికిడి. వీళ్ల పెళ్లికి అన్ని వైపుల నుంచీ... గ్రీన్ సిగ్నల్ అందినట్టే.
అయితే సమంత ఇంట్లో మాత్రం ఈ పెళ్లి ఏమాత్రం ఇష్టం లేదని తెలుస్తోంది. సమంత తరపున వాళ్లెవ్వరూ ఈ పెళ్లికి వచ్చే అవకాశం లేదని చెప్పుకొంటున్నారు. సమంత తల్లి దండ్రులు చెన్నైలోనే ఉంటున్నారు. వాళ్లకీ సమంతకీ ఈమధ్య రాకపోకలు లేవు. సమంత తల్లిదండ్రుల్ని పట్టించుకోవడం మానేసిందని, ఇంటికి కూడా వెళ్లడం లేదని ఆమధ్య వార్తలొచ్చాయి. ఆ మాటెలా ఉన్నా... చైతూతో పెళ్లి సమంత ఇంట్లోవాళ్లకు ఇష్టం లేదని వాళ్లెవ్వరూ పెళ్లికి రారని చెప్పుకొంటున్నారు. మరి ఇందులో నిజమెంతో.. సమంతకీ ఇంట్లో వాళ్లకూ మధ్య ఏం జరిగిందో తెలియాలంటే సమంత నోరు విప్పాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



