ఫిలింనగర్‌లో శాతకర్ణి రుద్రాభిషేకం..ఎందుకు..?
on Nov 28, 2016

నందమూరి నటసింహం బాలకృష్ణ హైదరాబాద్ ఫిలింనగర్‌లోని దైవసన్నిధానంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తన 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా ఘన విజయం సాధించాలని కోరుతూ బాలయ్య మహా రుద్రాభిషేకం చేయించారు. బాలకృష్ణతో పాటు దర్శకుడు క్రిష్ ఈ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. తెలుగు జాతి చరిత్రలోనే గొప్ప చక్రవర్తిగా ఖ్యాతిగాంచిన గౌతమీపుత్ర శాతకర్ణి జీవిత గాథతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తిచేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరగుతుండగా..ఈ సినిమాను సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. బాలయ్య సరసన శ్రీయ నటిస్తుండగా, శాతకర్ణి తల్లిగా బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమా మాలిని నటిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



