సాయానికి.. సై అంటున్న రాంచరణ్..!
on Sep 28, 2016
.jpg)
మిగిలిన హీరోలతో పోలిస్తే మెగా ఫ్యామిలీ హీరోలకు సమాజం అంటే కాస్త అభిమానం ఎక్కువ. తమను ఇంతవారిని చేసిన జనానికి ఏదో ఒకలా సాయపడటానికి వారు ఏమాత్రం వెనకడుగు వేయరు. దీనికి పునాది వేసిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్‌లను ఏర్పాటు చేసి ఆపన్నులను ఆదుకున్నారు చిరు. ఆ రెండు సంస్థలు ఇప్పటికీ తమ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఎవరైనా ఆపదలో ఉన్నారంటే చాలు వారిని ఓదార్చేదాకా కళ్యాణ్ విశ్రమించరు. హుధుద్ తుఫాను సమయంలో సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళం అందించడమే కాకుండా పరిశ్రమ నిర్వహించిన మేమే సైతం కార్యక్రమంలోనూ తన వంతూ సాయం చేశాడు.
ఇక మెగాస్టార్ నటవారసుడు రాంచరణ్ ఇప్పుడిప్పుడే సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మొదట్లో మీడియాతో దురుసుగా వ్యవహరించడం, కారుకు అడ్డం వచ్చారన్న కారణం చూపి తన సెక్యూరిటీ చేత ఇద్దరు వ్యక్తులపై దాడి చేయించడంతో అప్రతిష్ట మూటకట్టుకున్నాడు. కానీ ఏం జరిగిందో ఏమో కానీ చెర్రిలో అనూహ్యంగా మార్పు వచ్చింది. హుధుద్ సమయంలో సినీ పరిశ్రమ నుంచి మొదట స్పందించిన వ్యక్తి రాంచరణే. తాజాగా హైదరాబాద్ తుఫాను సమయంలో ఒక అనాధ అశ్రమం పిల్లలను ఆదుకున్నాడు. అలాగే వచ్చే నెల 15న ఉగ్రవాదుల చేతిలో మరణించిన బాధిత కుటుంబాల కోసం ఓ ఛారిటీ సంస్థ అమెరికాలో నిర్వహించే లైవ్ షోలో ప్రదర్శన ఇవ్వనున్నాడు. మొత్తానికి చరణ్ వ్యక్తిగతంగా చాలా మారాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



