ప్రభుదేవా దృష్టిలో నెం.1 డ్యాన్సర్ ఎవరు..?
on Sep 28, 2016
బాడీని స్ప్రింగ్‌లా వంచుతూ...బీట్‌కు తగ్గట్టుగా డ్యాన్స్ చేసి ఇండియన్ మైకేల్ జాక్సన్‌గా పేరు పొందిన కొరియోగ్రాఫర్ కమ్ హీరో ప్రభుదేవా. 90వ దశకంలో కొరియోగ్రఫర్‌గా భారతీయ చిత్ర పరిశ్రమను ఊర్రుతలూగించాడు ప్రభు. చాలా మంది స్టార్లు ఆయన కంపోజ్ చేసిన డ్యాన్సులతోనే స్టార్ స్టేటస్ అందుకున్నారు. 40 ప్లస్‌లోనూ..కుర్ర హీరోలను మించి డ్యాన్స్ చేస్తూ తనలో వాడి ఇంకా తగ్గలేదని నిరూపించాడు. అలాంటి ప్రభుదేవాను డ్యాన్సుల్లో మెప్పించాలంటే మామూలు విషయం కాదు. ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో ఒక ప్రశ్నకు సమాధానంగా తనకు ఇష్టమైన డ్యాన్సర్లు ఎవరో బయటపెట్టారు ప్రభుదేవా. ఆ విషయంలో ఆయనకు ముగ్గురు హీరోలంటే ఇష్టమట .
ఆ ముగ్గురు హీరోలు తెలుగు హీరోలే కావడం ఆశ్చర్యకరం. వారే స్టైలీష్ స్టార్ అల్లుఅర్జున్, మెగా పవర్‌స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్. "ఇద్దరమ్మాయిలతో" సినిమాలో "టాపు లేచిపోద్ది" పాటలో బన్నీ వేసిన స్టెప్స్, "బ్రూస్‌లీ"లో మెగామీటర్ సాంగ్‌లో చెర్రీ వేసిన స్టెప్స్, "నాన్నకు ప్రేమతో" మూవీలో ఐవానా ఫాలో ఫాలో సాంగ్‌కి ఎన్టీఆర్ స్టెప్స్ బాగా నచ్చాయని అన్నారు. తెలుగులో మంచి డ్యాన్స్ మాస్టర్స్ ఉన్నారని..వారు వేస్తోన్న స్టెప్స్ అంటే తనకు ఎంతో ఇష్టమని ప్రభుదేవా ప్రశంసించారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
