Home

»

Latest News

మహేశ్ సినిమాకు మెగా టైటిల్

Sep 28, 2016 4:25PM

టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్, మురుగదాస్ కాంభినేషన్‌లో తెరకెక్కుతున్న మూవీ వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలున్నాయి. అంతా బాగానే ఉంది కానీ..ఈ సినిమాకు ఏం టైటిల్‌ పెడతారా అని టాలీవుడ్, కోలీవుడ్ వర్గాలతో పాటు ఫ్యాన్స్‌లో ఉత్కంఠ నెలకొంది. సినిమా ఎనౌన్స్ చేయడానికి ముందు కాని.. షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత కాని టైటిల్ ఎంటన్నది బయటకు రాలేదు. అయితే జస్టిస్, న్యాయం కావాలి, చట్టంతో పోరాటం, ఎనిమి వంటి రకరకాల పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. కాని ఆ వార్తల్లో నిజం లేదని చిత్ర యూనిట్ తెలిపింది.

అయితే తాజాగా ఇప్పుడు ఈ మూవీకి "అభిమన్యు" అన్న టైటిల్ ఫిక్స్ చేశారని సమాచారం. ఆ టైటిల్‌ పేరుతో కూడిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను దసరా కానుకగా రిలీజ్ చేస్తున్నారని ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి నటించిన త్రినేత్రుడు సినిమాలో హీరో క్యారెక్టర్ పేరు అభిమన్యు. అలాగే 2003లో నందమూరి కళ్యాణ్‌రామ్ నటించిన సినిమా పేరు కూడా అభిమన్యునే. మరి ఈ టైటిల్ ఫిక్స్ అవుతుందో లేక మరేదైనా కొత్త పేరు తెరపైకి వస్తుందా అన్నది తెలియాలంటే దసరా వరకు వెయిట్ చేయాల్సిందే.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com