రామ్ చరణ్ మీసకట్టు లుక్ ఎలా ఉంది..?
on Jun 9, 2016

అల్లు అర్జున్ సరైనోడులో బన్నీ లుక్ కంప్లీట్ డిఫరెంట్ గా, మెచ్యూర్డ్ గా ఉంది. తన మీసకట్టులో ఛేంజెస్ తీసుకురావడమే దాని వెనుక రీజన్. రీసెంట్ గా రామ్ చరణ్ కూడా అదే రూట్ ఫాలో అవుతున్నాడు. ఐపిఎస్ ఆఫీసర్ గా కనిపించనున్న ' ధృవ ' కోసం మీసాన్ని పెంచి క్లాస్ గా ఐపిఎస్ లుక్ లోకి వచ్చేశాడు. చరణ్ ఈ స్టైల్ మీసకట్టు తీయడం ఇదే ఫస్ట్ టైం. మగథీరలో కూడా కొద్దిగా ఉన్నా, అది రగ్గడ్ లుక్ తో గడ్డంతో కలిసిపోయి ఉంటుంది. ధృవ కోసం మాత్రం ఐపిఎస్ ఆఫీసర్ గా పూర్తిగా ట్రాన్ ఫార్మ్ అయిపోయాడు చెర్రీ. ప్రస్తుతం ' ధృవ ' షూటింగ్ గచ్చిబౌలిలో జరుగుతోంది. ఆ సమయంలో అక్కడున్న ఫ్యాన్స్ చెర్రీతో సెల్ఫీ దిగడంతో, ఈ లుక్ బయటికొచ్చింది. చూస్తుంటే నిజమైన ఐపిఎస్ ఆఫీసర్లా ఉన్నాడంటూ మెగాఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. మీసం అల్లు అర్జున్ కు అచ్చొచ్చింది. మరి చెర్రీ కి కూడా కలిసొస్తుందా.. చూద్దాం.!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



