నాగచైతన్య సమంత మరోసారి..!
on Jun 9, 2016
సమంత, నాగచైతన్య. ఈ రెండు పేర్లు గత కొన్నాళ్లుగా జనం నోట్లో నానుతున్నాయి. ఇద్దరికీ మధ్య లవ్ స్టోరీ సాగుతోందంటూ వస్తున్న వార్తలే అందుక్కారణం. వాటిలో నిజం ఎంత ఉందో పక్కన పెడితే, ఇద్దరి ఆన్ స్క్రీన్ పెయిర్ కు మంచి క్రేజ్ ఉంది. ఏమాయ చేశావే లో వీళ్లిద్దరూ ఏ రేంజ్ రొమాన్స్ పండించారో తెలిసిందే. ఆ తర్వాత ఆటోనగర్ సూర్య, మనం సినిమాల్లో కూడా చైతూ స్యామ్ కెమిస్ట్రీ వర్కవుట్ అయింది. తాజాగా మరో సినిమాలో వీళ్లిద్దరూ కలిసి కనువిందు చేయబోతున్నారట. నాగ్ తో సోగ్గాడే చిన్ని నాయనా లాంటి హిట్ కొట్టిన కళ్యాణ్ కృష్ణ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.
పూర్తి రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కే ఈ సినిమాలో చైతూ సమంతను తీసుకోవాలని క్లియర్ గా చెప్పేయడంతో మూవీ టీం స్యామ్ కే ఓటేశారు. జూలై నుంచి షూటింగ్ మొదలవుతుందని సమాచారం. ప్రస్తుతం చైతన్య సాహసం శ్వాసగా, ప్రేమమ్ సినిమాల పోస్ట్ ప్రొడక్షన్ లో బిజీగా ఉన్నాడు. మరోవైపు సమంత జనతా గ్యారేజ్ లో షూటింగ్ చేస్తోంది. అది పూర్తయిన తర్వాత స్కిన్ ట్రీట్ మెంట్ కోసం కాస్త గ్యాప్ తీసుకోబోతోందట స్యామ్స్. ఆ తర్వాత ఈ కొత్త సినిమా షూటింగ్ లో జాయిన్ అవుతుంది. మరి రియల్ లైఫ్ పెయిర్ గా గాసిప్స్ లో ఉన్న ఈ జంట ఆన్ స్క్రీన్ ఏ రేంజ్ లో పెర్ఫామ్ చేస్తారో చూడాలి.