మారక తప్పటం లేదు.. చరణ్ పిక్స్ వైరల్
on Jul 21, 2025
గ్లోబల్ స్టార్ 'రామ్ చరణ్'(Ram Charan)ప్రస్తుతం చేస్తున్న 'పెద్ది'(Peddi)ప్రాజెక్ట్ పై అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోను భారీ అంచనాలు ఉన్నాయి. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో పక్కా యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న 'పెద్ది' ఇప్పటికే కొంత భాగాన్ని షూటింగ్ పూర్తి చేసుకుంది. చరణ్ బర్త్ డే సందర్భంగా వచ్చే ఏడాది మార్చి 27 విడుదల కానుండగా, ఇప్పటికే విడుదలైన చరణ్ లుక్ తో పాటు ఫస్ట్ గ్లింప్స్, డైలాగ్స్, యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ తో ముందుకు దూసుకుపోతున్నాయి.
రీసెంట్ గా చరణ్ సోషల్ మీడియా వేదికగా జిమ్ లో వర్క్ అవుట్ చేస్తున్న పిక్స్ షేర్ చేస్తు 'పెద్ది' కోసం ఈ విధంగా మారుతున్నాను. దృఢమైన సంకల్పం, గొప్ప ఆనందం అనే క్యాప్షన్ ని ఉంచాడు. డిఫరెంట్ యాంగిల్స్ తో ఉన్నచరణ్ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అభిమానులు అయితే చరణ్ పిక్స్ ని షేర్ చేస్తు క్యారక్టర్ కోసం చరణ్ పడే కష్టాన్ని అభినందిస్తున్నారు. 'పెద్ది' లో క్రికెట్ తో పాటు పలు రకాల క్రీడల్లో ప్రావిణ్యం ఉన్న ఆటగాడిగా చరణ్ కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. టీజర్ లో చరణ్ చెప్పిన డైలాగ్స్ కూడా ఆ విషయాన్నీ దృవీకరిస్తున్నాయి.
చరణ్ సరసన జాన్వీ కపూర్(Janhvi Kapoor)జత కడుతుంది. దీంతో 'ఎన్టీఆర్'(Ntr)దేవరలో తన పెర్ఫార్మెన్సు తో ఆకట్టుకున్న జాన్వీ 'పెద్ది' లో ఏ విధంగా కనిపించబోతుందనే ఆసక్తి అందరిలో ఏర్పడింది. ఉప్పెన తర్వాత దర్శకుడు 'బుచ్చిబాబు'(Buchibabu)ఎంతో గ్యాప్ తీసుకొని 'పెద్ది'ని తెరకెక్కిస్తున్నాడు. 'పుష్ప 2'(Pushpa 2)తో పాన్ ఇండియా మేకర్స్ గా మైత్రి సంస్థ మంచి పేరు సంపాదించిన విషయం తెలిసిందే. దీంతో 'పెద్ది' ని అంతకు మించి సక్సెస్ చెయ్యాలని భావిస్తుంది. వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ కూడా నిర్మాణ భాద్యతలని వహిస్తున్నారు. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్(Shiva rajkumar)గౌర్ నాయుడు' అనే క్యారక్టర్ లో కనిపిస్తున్నాడు. ఇటీవల విడుదలైన గౌర్ నాయుడు లుక్ కూడా మూవీపై అంచనాలు పెంచేసింది. జగపతి బాబు, దివ్యేన్డు శర్మ ఇతర ముఖ్య పాత్రల్లో చేస్తుండగా 'ఏఆర్ రెహ్మాన్'(Ar Rehman)సంగీతాన్ని అందిస్తున్నాడు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
