బాహుబలి సినిమా మిస్ చేసుకున్న జయసుధ కుమారుడు!
on Jul 20, 2025

తెలుగు సినిమాని ప్రపంచస్థాయికి తీసుకెళ్ళిన చిత్రం 'బాహుబలి'. ప్రభాస్, రానా ప్రధాన పాత్రల్లో రాజమౌళి సృష్టించిన ఈ అద్భుతం.. తెలుగు సినిమా మార్కెట్ ని అమాంతం పెంచేయడమే కాకుండా, పాన్ ఇండియా ట్రెండ్ కి శ్రీకారం చుట్టింది. ఇంతటి సంచలన చిత్రంలో నటించే అవకాశాన్ని సీనియర్ నటి జయసుధ కుమారుడు నిహార్ కపూర్ మిస్ చేసుకున్నాడు. ఈ విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్వయంగా ఆయనే పంచుకున్నాడు.
"మొదట భళ్లాలదేవ పాత్రను రానానే చేయాలి. కానీ, ఆయన డేట్స్ కుదరకపోవడంతో ఆ పాత్రకు నన్ను సంప్రదించారు. నాలుగు వారాలు ట్రైనింగ్ సెషన్స్ లో కూడా పాల్గొన్నా. ఆ తర్వాత భళ్లాలదేవ పాత్ర చేస్తానని మళ్ళీ రానా చెప్పడంతో.. అప్పుడు నాకు కాలకేయ రోల్ ఆఫర్ చేశారు. ఆ పాత్రకు సంబంధించి ఓ క్యారికేచర్ చూపించారు. ఎక్కువగా ప్రోస్థటిక్ మేకప్ వేశారు. ఈ విషయాన్ని అమ్మకు చెప్తే.. 'మొదటి సినిమానే ఇలా ఫేస్ సరిగా కనిపించని పాత్ర చేస్తే ప్రేక్షకులు గుర్తించరు' అని సలహా ఇచ్చారు. దాంతో కాలకేయ పాత్ర చేయనని చెప్పాను. తర్వాత ఆ పాత్రను ప్రభాకర్ చేశారు. అయితే క్యారికేచర్ తో పోలిస్తే.. స్క్రీన్ పై ఆ పాత్ర మారిపోయింది. కాలకేయ పాత్ర చేయనందుకు తానేమీ బాధపడట్లేదు. ఆ సినిమా చేయకపోయినా రాజమౌళి గారితో మంచి అనుబంధముంది." అని నిహార్ కపూర్ చెప్పుకొచ్చాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



