కోట శ్రీనివాసరావు ఇంటికి మోహన్ బాబు.. కీలక విషయాలు వెల్లడి
on Jul 21, 2025

ఈ నెల 13 న లెజండ్రీ యాక్టర్ 'కోటశ్రీనివాసరావు'(Kota Srinivasarao)హైదరాబాద్(Hyderabad)లోని ఫిలింనగర్ లో ఉన్న తన నివాసంలో మరణించిన విషయం తెలిసిందే. దీంతో చిరంజీవి(Chiranjeevi)తో సహా చిత్ర పరిశమ్రకి చెందిన పలువురు ప్రముఖులు కోట శ్రీనివాసరావు భౌతిక గాయాన్ని సందర్శించి, ఆయన మృతి పట్ల తమ ప్రగాఢ సానుభూతిని తెలియచేసారు.
'మోహన్ బాబు'(MOhan Babu)రీసెంట్ గా కోటశ్రీనివాసరావు ఇంటికి వెళ్ళి ఆయన కుటుంబ సభ్యుల్ని పరామర్శించడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతు కోటశ్రీనివాసరావు నాకు అత్యంత ఆప్తుడుతో పాటు,మా ఫ్యామిలీకి కూడా మంచి సన్నిహితులు. అటువంటి వ్యక్తి మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది, ఆయన అకాల మరణం చెందిన రోజు నేను హైదరాబాద్‌లో లేను. కన్నప్ప రిలీజ్ రోజు ఫోన్ చేసారు. సినిమా చాలా బాగుంది. విష్ణుకి మంచి పేరు వచ్చిందని చెప్తున్నారని నాతో మాట్లాడారు. 1987 సంవత్సరంలో నా బ్యానర్ లో వచ్చిన "వీరప్రతాప్" అనే మూవీలో మాంత్రికుడు క్యారక్టర్ లో మెయిన్ విలన్‌గా అవకాశం ఇచ్చాను
ఆ తర్వాత కూడా మా బ్యానర్ తో పాటు, బయట బ్యానర్‌లలో ఇద్దరం కలిసి చాలా సినిమాల్లో నటించాం. ఏ పాత్రనైనా అవలీలగా పోషించడమే కాకుండా, విలన్‌గా, కమెడియన్‌గా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా డిఫరెంట్ టైప్ ఆఫ్ మాడ్యులేషన్‌లో ఏ డైలాగ్ అయినా చెప్పగలిగే గొప్ప నటుడు కోట. అటువంటి వ్యక్తి మరణం ఆయన కుటుంబానికే కాకుండా సినిమా పరిశ్రమకు తీరని లోటు. వారి ఆత్మకు శాంతి, వారి కుటుంబానికి మనశ్శాంతి కలగాలని కోరుకుంటున్నానని చెప్పాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



