బాలీవుడ్ హీరోకి రామ్‌చరణ్ సవాల్
on Apr 21, 2020

అవును... బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్‌కి రామ్‌చరణ్ సవాల్ విసిరారు. ప్రస్తుతానికి అటువైపు నుండి ఎటువంటి స్పందన రాలేదు. కానీ, కచ్చితంగా వస్తుందని మాత్రం చెప్పవచ్చు. అసలు వివరాల్లోకి వెళితే... దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా ప్రారంభించిన ‘బీ ది రియల్‌మేన్’ ఛాలెంజ్‌లో రాజమౌళి పాల్గొన్నారు. ఆయన ఛాలెంజ్ చేసిన వ్యక్తుల్లో రామ్‌చరణ్ ఒకరు. జక్కన్న సవాల్‌ను స్వీకరించిన చరణ్, టాస్క్ పూర్తి చేశారు. మాసిన దుస్తులను పడక గదిలోంచి వాషింగ్ మెషీన్ వరకూ తీసుకువెళ్లడంతో పాటు ఇళ్లు శుభ్రం చేయడం, మొక్కలకు నీళ్లు పోయడం, శ్రీమతి ఉపాసనకు కాఫీ చేసి ఇవ్వడం వంటి పనులన్నీ రామ్‌చరణ్ చేశారు.
అంతే కాదు... ఇప్పుడీ ‘బీ ది రియల్‌మేన్’ ఛాలెంజ్‌ను మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ బాలీవుడ్‌కి తీసుకువెళ్తున్నారు. అదెలా అంటే... ఛాలెంజ్‌లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ మరో నలుగురిని నామినేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. రామ్‌చరణ్ కూడా తన స్నేహితులు రానా దగ్గుబాటి, శర్వానంద్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ను నామినేట్ చేశారు. వీరితో పాటు బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్‌ను నామినేట్ చేశారు. సోషల్ మీడియాలో రణవీర్, దీపిక దంపతులు ఇటువంటి ఛాలెంజ్స్ స్వీకరించడంలో ముందుంటారు. మామూలుగానే ఇంటి పని, వంట పని విషయాల్లో సోషల్ మీడియాలో సరదాగా కామెంట్స్ చేసుకుంటారు. ఇప్పుడు రణవీర్ ఏం చేస్తాడో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



