ఇట్స్ మై ఛాలెంజ్ తారక్!
on Apr 21, 2020

జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చిన ఛాలెంజ్‌ను తనదైన స్టైల్‌లో స్వీకరించారు మెగాస్టార్ చిరంజీవి. #BeTheRealMan ఛాలెంజ్ సంగతి తెలిసిందేగా. అర్జున్‌రెడ్డి డైరెక్టర్ సందీప్‌రెడ్డి వంగా దీన్ని మొదలు పెట్టి, కొంతమందికి ఛాలెంజ్ విసిరారు. వారిలో యస్.యస్. రాజమౌళి కూడా ఉన్నారు. ఆయన దాన్ని స్వీకరించి, ఇంటిపనులు.. అంటే చీపురు పట్టి పరిసరాలు ఊడ్చడం, ఇంటిని శుభ్రం చేయడం వంటివన్నమాట.. చేశారు. ఆయన ఇచ్చిన ఛాలెంజ్‌ను మంగళవారం మొదట జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ స్వీకరించి, తమ ఇంటి పనులు చేసి రియల్ మెన్ అనిపించుకున్నారు.
జూనియర్ ఆ ఛాలెంజ్‌ను తన బాబాయ్ బాలయ్య, చిరంజీవి, మరికింత మందికి విసిరారు. ఆ ఛాలెంజ్‌ను తన స్టైల్‌లో అందుకున్నారు చిరంజీవి. "చాలెంజ్ యాక్సెప్టెడ్ తారక్. అలాగే యువర్ పార్టనర్ ఇన్ క్రైమ్ రామ్‌చరణ్ వీడియో కోసం వెయిటింగ్" అంటూ తను నటించిన ఛాలెంజ్ సినిమాలో 'ఇట్స్ మై ఛాలెంజ్' అంటూ తను చెప్పే డైలాగ్ క్లిప్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనికి ఆయన ఫ్యాన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంతా కాదు. మొత్తానికి #BeTheRealMan ఛాలెంజ్ పుణ్యమా అని మన మేల్ సెలబ్రిటీస్ చీపుర్లు పట్టడం, ఇల్లు శుభ్రం చేయడం, బట్టలు ఉతకడం వంటి పనులు చేయడాన్ని వీక్షించే భాగ్యం మనకు కలుగుతోంది. ఏదో ఒక్కసారి కాకుండా వాళ్లు రోజూ ఈ పనులు చేస్తూ, తమ భార్యలకు, తల్లులకు పని భారం తగ్గిస్తే బాగుంటుంది కదా!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



