నిరాడంబరంగా షకలక శంకర్ పెళ్లి..పెళ్లి ఖర్చు అనాథలకు..!
on Apr 23, 2016

జబర్దస్త్ ప్రోగ్రామ్ ద్వారా పాపులర్ అయిన షకలక శంకర్ ఓ ఇంటి వాడయ్యాడు. శ్రీకాకుళం జిల్లా అరసవిల్లిలోని ఒక ప్రైవేట్ కళ్యాణమండపంలో ఎటువంటి ఆర్భాటాలు లేకుండా నిరాడంబరంగా ఆయన పెళ్లి జరిగింది. వరుసకు మేనమామ కూతురు అయిన పార్వతిని శంకర్ వివాహమాడారు. తన తండ్రి మొక్కు కారణంగా అరసవిల్లిలో పెళ్లి చేసుకున్నానని. అందుకే జబర్దస్త్ యాక్టర్స్ ఎవ్వరిని పిలవలేదన్నారు. కోట్లాది మంది మొక్కే ప్రత్యక్ష దైవమైన ఆ సూర్యనారాయణ స్వామి సన్నిధిలో పెళ్లి చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. తాను హాస్టల్‌లో ఉండి 10వ తరగతి వరకు చదవుకున్నానని, అక్కడి పిల్లల బాధలు తెలుసునని పెళ్లి ఆర్భాటంగా చేసుకోవడం కంటే ఇటువంటి సేవా కార్యక్రమాలకు ఆ డబ్బు ఇవ్వాలనుకుంటున్నాని శంకర్ తన మనసులో మాట బయట పెట్టారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



