తండ్రి కాబోతున్న రామ్‌చరణ్!
on Dec 12, 2022

ఆంజనేయ స్వామి ఆశీస్సులతో రామ్‌చరణ్- ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారు అంటూ మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇంకేముంది మెగాస్టార్ చిరంజీవి తాత కాబోతున్నారనే వార్త వైరల్ గా మారింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు ఉపాసనతో పెళ్లి జరిగి 10 సంవత్సరాలు అవుతోంది. ఇప్పటికీ ఈ దంపతులకు పిల్లలు లేరనే టాపిక్ ఎప్పుడూ వస్తూనే ఉంది. అయితే ఆ ప్రశ్నలకు తమదైన స్టైల్ లో సమాధానాలు చెబుతూ వస్తున్నారు మెగా ఫ్యామిలీ. పది సంవత్సరాలు దాటిన తర్వాత రామ్ చరణ్ మరియు ఉపాసన తల్లిదండ్రులు అవ్వబోతున్న నేపథ్యంలో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేవు.

ఈ విషయం తెలుసుకున్నసెలెబ్రెటీస్, ఫ్యాన్స్.. సోషల్ మీడియా వేదికగా రామ్ చరణ్, ఉపాసనలతో పాటు తాత కాబోతున్న మెగాస్టార్ చిరంజీవికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న పాన్ ఇండియా మూవీ RC15లో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చకచకా జరుగుతోంది. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



