'పుష్ప-2' నుంచి పులి డైలాగ్ లీక్!
on Dec 12, 2022

సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన 'పుష్ప: ది రైజ్'తో తగ్గేదేలే అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సంచలనం సృష్టించాడు. అందులో బన్నీ చెప్పిన డైలాగ్స్ ట్రెండ్ అయ్యాయి. ఇప్పుడు రెండో భాగంగా రూపొందుతోన్న 'పుష్ప: ది రూల్'లో కూడా అదే స్థాయిలో పవర్ ఫుల్ డైలాగ్స్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
'పుష్ప-2'లో బన్నీ పులితో తలపడే సీన్ ఉంటుందని కొద్ది రోజులుగా వార్తలొస్తున్నాయి. అంతేకాదు ఈ చిత్రంలో పులి కంటే పుష్ప రాజ్ పవర్ ఫుల్ అని తెలిపేలా ఒక డైలాగ్ కూడా ఉంటుందట. 'పుష్ప-2'లోని డైలాగ్ అంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ డైలాగ్ వైరల్ గా మారింది. "అడవిలో జంతువులు నాలుగు అడుగులు వెనక్కి వేసాయంటే పులి వచ్చిందని అర్ధం.. అదే పులి నాలుగు అడుగులు వెనక్కి వేసిందంటే పుష్ప రాజ్ వచ్చాడని అర్థం" అంటూ ఈ డైలాగ్ ఉండనుందని ప్రచారం జరుగుతోంది. డైలాగ్ అదిరింది అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి 'పుష్ప-2'లో నిజంగానే ఈ డైలాగ్, పులి ఫైట్ ఉంటాయేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



