సంచలనంగా మారిన మైత్రి సంస్థపై ఐటీ దాడులు!
on Dec 12, 2022

టాలీవుడ్ కి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ కార్యాలయాల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. సోమవారం ఉదయం నుంచి మైత్రి సంస్థకి చెందిన 15 చోట్ల ఏక కాలంలో సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
'శ్రీమంతుడు', 'జనతా గ్యారేజ్', 'రంగస్థలం', 'ఉప్పెన', 'పుష్ప' వంటి పలు బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించిన మైత్రి.. తక్కువ కాలంలో అగ్ర నిర్మాణ సంస్థగా ఎదిగింది. ప్రస్తుతం మైత్రి ఎన్నో భారీ చిత్రాలను నిర్మిస్తోంది. అలాగే మైత్రి మూవీస్ నిర్మిస్తున్న 'వాల్తేరు వీరయ్య', 'వీర సింహా రెడ్డి' సినిమాలు 2023 సంక్రాంతికి ఒకేసారి విడుదల కానుండటం కొద్దిరోజులుగా హాట్ టాపిక్ గా మారింది. పైగా థియేటర్ల సమస్య వస్తుందని భావించిన ఆ సంస్థ.. భవిష్యత్తులోనూ తమ సినిమాలకు ఇబ్బంది తలెత్తకుండా ఉండేందుకు.. థియేటర్లపై పట్టు సాధించడం కోసం తాజాగా డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి కూడా అడుగు పెట్టింది. ఈ క్రమంలో మైత్రి సంస్థపై ఐటీ సోదాలు జరుగుతుండటం సంచలనంగా మారింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



