రామ్ చరణ్ ' ధృవ ' ఫస్ట్ లుక్..!
on Jun 11, 2016

రామ్ చరణ్ తో చేస్తున్న ధృవ మీద ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు దర్శకుడు సురేందర్ రెడ్డి. రీసెంట్ గా తన ఫేస్ బుక్ లో చెర్రీ ఫస్ట్ లుక్ ను విడుదల చేశాడు. చూశారుగా..ఫస్ట్ లుక్ ఎలా ఉందో..? సింపుల్ గా చెర్రీ ఫేస్ సైడ్ యాంగిల్ కొట్టి, దానికి కొన్ని మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ను ఓవర్ లేయర్ గా వేసి లుక్ వదిలాడు సురేందర్. లుక్ అయితే ఇరగదీసింది మరి. ప్రస్తుతం డైరెక్టర్ కు, హీరోకు ఇద్దరికీ కూడా హిట్టు అత్యవసరం. ఎలాగూ ఒక చోట ప్రూవ్ అయిన కథ కాబట్టి, వీళ్లిద్దరూ ఆ విషయంలో పెద్దగా దిగులు పడక్కర్లేదు. ఆడియన్స్ ను రెండున్నర గంటల పాటు థియేటర్లో కదలకుండా కూర్చోబెట్టగలిగితే చాలు. రికార్డులు పగిలిపోవడం కన్ఫామ్.
ఇప్పటికే మూవీకి సంబంధించి రెండు షెడ్యూల్స్ పూర్తైపోయాయి. మూవీ షూటింగ్ శరవేగంగా సాగిపోతోంది. మూడో షెడ్యూల్ ను కాశ్మీర్ లో ప్లాన్ చేశారట. ఈ సినిమా కోసం చెర్రీ మరింత లీన్ గా, అథ్లెటిక్ బాడీని తయారుచేసుకున్నాడు. కెరీర్లో ఫస్ట్ టైం ట్రిమ్డ్ మీసకట్టులో కనిపించడం విశేషం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



