జగ్గూభాయ్ లుక్ అదుర్స్ కదూ..!
on Jun 11, 2016
శోభన్ బాబు తర్వాత మళ్లీ ఆ స్థాయి హీరో అంటూ జగపతిబాబును ఆరాధించారు తెలుగు ప్రేక్షకులు. ఇద్దరు భామల ముద్దుల ప్రియుడిగా చాలా సినిమాల్లోనే చేశాడు జగ్గూ భాయ్. అయితే ట్రెండ్ మారేకొద్దీ, దానికి తగ్గట్టుగా తన కెరీర్ ను మార్చుకున్నాడు. హీరోగా సైడ్ అయి, విలన్ గా కీలక పాత్రలు చేస్తున్నాడు. లెజండ్ లో జగ్గూ చేసిన యాక్టింగ్ బాలయ్య హీరోయిజాన్ని ఎలివేట్ చేసిందంటే సందేహం లేదు.
నాన్నకు ప్రేమతో లో మరో డిఫరెంట్ స్టైల్ విలన్ గా నటించి మెప్పించాడు జగపతి. ప్రస్తుతం కేవలం తెలుగే కాక, ఇతర భాషల నుంచి ఆయనకు ఆఫర్లు వస్తున్నాయి. తమిళంలో ఇప్పటికే తాండవం, లింగా సినిమాల్లో చేసినా, అవి సక్సెస్ కాకపోవడంతో మళ్లీ ఆయన అక్కడ ప్రయత్నం చేయలేదు. తాజాగా తమిళనాట మరోసారి తన విలనిజాన్ని టేస్ట్ చేయించడానికి రెడీ అవుతున్నాడు జగ్గూ. విజయ్ హీరోగా వస్తున్న ఒక కొత్త సినిమాలో విలన్ గా చేస్తున్నాడు. ఈ లుక్ ఆ సినిమాలోదే. మరి అక్కడ జగ్గూభాయ్ ఈ సినిమాతోనైనా జైత్రయాత్ర మొదలెడతాడేమో చూడాలి.