బాలయ్యను లేటుగా చూసిన రాజమౌళి..!
on Jun 11, 2016
.jpg)
బాహుబలి పార్ట్ 2 షూటింగ్ టెన్షన్ ఒక వైపు, ఎడతెరిపి లేని అవార్డు ఫంక్షన్లు, పరభాషా ప్రమోషనల్ ప్రోగ్రాంలు మరో వైపు. అసలు ఈ మధ్య కాలంలో రాజమౌళి ఖాళీగా ఉన్నది చాలా తక్కువేనని చెప్పాలి. ఈ హడావిడి కారణంగానే కనీసం తన సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లోకి కూడా రాలేకపోతున్నాడు జక్కన్న. అయితే రీసెంట్ గా రిలీజైన బాలయ్య శాతకర్ణి ఫస్ట్ లుక్ చూసిన తర్వాత మళ్లీ ట్విట్టర్ లో అడుగుపెట్టాడు. ఫస్ట్ లుక్ లేట్ గా చూశానని, లుక్ మాత్రం టెర్రిఫిక్ గా ఉందంటూ ట్వీట్ చేశాడు.
దీంతో పాటు, తన సినీ గురువు దర్శకేంద్రుడు మొదలెట్టిన యూట్యూబ్ డైరెక్షన్ క్లాస్ రూమ్ గురించి కూడా ట్వీటాడు. ఆయన 50 ఏళ్ల కెరీర్లో ఉన్న ఎన్నో అనుభవాల్ని కేవలం నిముషాల్లోనే ఔత్సాహిక దర్శకులకు నేర్పిస్తున్నారని, డైరెక్టర్ కావాలనుకునే ప్రతీ ఒక్కరూ ఈ వీడియోస్ చూడాల్సిందేనంటున్నాడు. ఆయన సలహాలే తనను దర్శకుడిగా మంచి ప్లేస్ లో నిలబెట్టాయని, స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో తనను మంచి దర్శకుడిగా నిలబెట్టిన ఘనత కూడా తన గురువుదేనంటూ ట్వీటాడు దర్శక బాహుబలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



