రకుల్ ప్రీత్‌కు కరోనా!
on Dec 22, 2020
కరోనా వైరస్ బారిన పడిన సినీ సెలబ్రిటీల లిస్ట్‌లో లేటెస్ట్‌గా టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ చేరారు. తనకు టెస్ట్‌లో కొవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఆమె తెలియజేశారు. అయితే తనకు బాగానే ఉందని ఆమె చెప్పారు. మంగళవారం మధ్యాహ్నం తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా ఈ మేరకు ఓ నోట్ షేర్ చేశారు.
"అందరికీ తెలియజేయునది ఏమనగా, నేను కొవిడ్-19 పాజిటివ్‌గా టెస్ట్‌లో నిర్ధారణ అయ్యాను. స్వీయ క్వారంటైన్‌లోకి వెళ్లాను. నాకిప్పుడు బాగానే ఉంది. తగినంత విశ్రాంతి తీసుకొని, త్వరలో షూటింగ్‌కు తిరిగొస్తాను. నన్ను కలిసిన వాళ్లందర్నీ దయచేసి టెస్ట్ చేయించుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. Thankyou and Please stay safe" అని ఆమె ఆ నోట్‌లో పేర్కొన్నారు.
క్రిష్ డైరెక్ట్ చేస్తోన్న 'కొండపొలం' షూటింగ్‌ను ఇటీవలే రకుల్ పూర్తి చేశారు. నితిన్‌తో చంద్రశేఖర్ ఏలేటి రూపొందిస్తోన్న 'చెక్' మూవీలో నాయికగా నటిస్తున్నారు. అలాగే అజయ్ దేవ్‌గణ్ నటిస్తూ, డైరెక్ట్ చేస్తోన్న 'మేడే' మూవీ షూటింగ్‌లో ఆమె పాల్గొంటున్నారు. ఈ మూవీలో అమితాబ్ బచ్చన్ మరో కీలక పాత్ర చేస్తున్నారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
