ఏడాదిన్నరగా నా భర్త నా దగ్గరకు రావట్లేదు!
on Jan 5, 2021

రానున్న బిగ్ బాస్ 14 ఎపిసోడ్‌లో తన భర్త రితేష్ గురించి షాకింగ్ విషయాలు వెల్లడించింది ఫైర్ బ్రాండ్ ఐటమ్ గాళ్‌గా పేరుపొందిన రాఖీ సావంత్. బిగ్ బాస్ 14లో కంటెస్టెంట్‌గా పార్టిసిపేట్ చేస్తున్న ఆమె తోటి కంటెస్టెంట్ అభినవ్ శుక్లాతో సన్నిహితంగా మెలగుతూ వస్తోంది. తాజా ప్రోమోలో అతనితో రాఖీ జరిపిన సంభాషణనూ చూపించారు. తన నుంచి భర్త విడాకులు కోరుకుంటున్నట్లయితే, హాయిగా ఆ పని చేసుకోవచ్చని ఆమె చెప్పింది. అలా ఎందుకు అంటున్నావని అభినవ్ ప్రశ్నించగా, ఒకటిన్నర సంవత్సరం నుంచి తన భర్త తన దగ్గరకు రాలేదనే షాకింగ్ న్యూస్ వెల్లడించింది రాఖీ. అంతే కాదు, ఇప్పుడు అతను వస్తాడని కూడా తాను ఎక్స్‌పెక్ట్ చేయట్లేదని ఆమె చెప్పింది.
ఎన్నారై అయిన రితేష్‌ను 2019లో ఆమె పెళ్లాడింది. ఆ తర్వాత మూడుసార్లు పిలిచినా అతను రాలేదనీ, తన చేతులకు నాలుగు సార్లు గోరింటాకు వేసుకున్నా అతను రాలేదనీ ఆమె వెల్లడించింది. భర్త గురించి స్పెషల్‌గా తానేమీ ఫీలవట్లేదని చెప్పింది రాఖీ. "నా భర్త కోసం నా గుండెలో గంటలేమీ మోగడం లేదు." అని చెప్పింది రాఖీ.
అయితే ఇవన్నీ తాను ఓ నేషనల్ టెలివిజన్ చానల్ షోలో చెబుతున్నాననే విషయం గ్రహించిన రాఖీ నాలుక కరుచుకొని, మీడియాకు ఈ విషయాలు లీక్ చెయ్యాలని తానెప్పుడూ అనుకోలేదని తెలిపింది. అంతేకాదు, అప్పటిదాకా చెప్పిన విషయాల్ని మార్చేసింది. తన భర్తను మిస్సవుతున్నానంటూ బిగ్ బాస్‌తో చెప్పుకొని, కనీసం ఒక్కసారైనా అతను బయటకు రావాలని ఆశిస్తున్నానని తెలిపింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



