మొత్తానికి భార్యను పరిచయం చేశాడు!
on Jan 5, 2021

ఇటీవలే పెళ్లి చేసుకున్న బాలీవుడ్ పాపులర్ డైరెక్టర్ అలీ అబ్బాస్ జాఫర్ తన భార్య అలీసియా జాఫర్‌ను తొలిసారి ప్రపంచానికి పరిచయం చేశాడు. ఒక ప్రైవేట్ వేడుకలో పెళ్లాడిన అలీ అబ్బాస్ సోమవారం తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా తన భార్య చేతిని పట్టుకొని ఉన్న అందమైన పిక్చర్‌ను షేర్ చేసిన విషయం తెలిసిందే. నిన్న భార్య పేరును కానీ, ఆమె ముఖాన్ని కానీ వెల్లడించని అతను, మంగళవారం ఆ రెండూ వెల్లడించాడు. ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో లేటెస్ట్‌గా రెండు పిక్చర్స్‌ను అతను షేర్ చేశాడు.
తామిద్దరు కౌగలించుకొని సన్నిహితంగా ఉన్న పిక్చర్‌ను షేర్ చేసిన అలీ అబ్బాస్, దానికి "1400 సంవత్సరాల క్రితం ఫాతిమా అల్-జారాకు ఇమామ్ అలీ 'నీ ముఖం వంక చూడగానే నా మొత్తం బాధలు, విచారం మాయమవుతాయి' అని చెప్పారు. నేనూ అలాగే ఫీలవుతున్నా అలీసియా జాఫర్. Mine for life." అంటూ రాసుకొచ్చాడు. ఆ తర్వాత తన తల్లిదండ్రులతో కలిసి పోజిచ్చిన అలీసియా పిక్చర్‌ను షేర్ చేసిన అతను, "ఫ్యామిలీకి స్వాగతం" అనే క్యాప్షన్ పెట్టాడు. ఈ జంటకు పలువురు సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలియజేశారు.
సల్మాన్ ఖాన్ హీరోగా అలీ అబ్బాస్ రూపొందించిన 'టైగర్ జిందా హై', 'సుల్తాన్' సినిమాలు బ్లాక్‌బస్టర్ అయ్యాయి.
.jpg)
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



