డింపుల్ హయతి, రాశీ సింగ్ చేతుల మీదుగా రాజు గాని సవాల్ ట్రైలర్ లాంఛ్
on Jul 19, 2025
లెలిజాల రవీందర్, రితికా చక్రవర్తి హీరో హీరోయిన్ లుగా నటిస్తున్న చిత్రం 'రాజు గాని సవాల్'(Raju Gani saval). లెలిజాల కమల ప్రజాపతి సమర్పణలో, ఎల్ ఆర్ ప్రొడక్షన్ బ్యానర్ పై లెలిజాల రవీందర్ నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నాడు. 'రక్షా బంధన్' పండుగ సందర్భంగా ఆగస్టు 8న రిలీజ్ కి సిద్ధమవుతుండగా, శ్రీ లక్ష్మి పిక్చర్స్ పై బాపిరాజు చాలా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు.
నిన్న శుక్రవారం ఈ మూవీట్రైలర్ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ప్రముఖ హీరోయిన్ లు డింపుల్ హయతి, రాశీ సింగ్ ట్రైలర్ రిలీజ్ చేసారు. తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు భరత్ భూషణ్, ప్రొడ్యూసర్లు దామోదర ప్రసాద్, ప్రసన్నకుమార్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, గీత రచయిత గోరటి వెంకన్న, నటుడు భద్రం, ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. హీరోయిన్ డింపుల్ హయతి మాట్లాడుతు రాజు గాని సవాల్ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ కి గెస్ట్ గా రావడం హ్యాపీగా ఉంది. ట్రైలర్, సాంగ్స్ చాలా బాగున్నాయి. నేను కెరీర్ ప్రారంభించిన కొత్తలో కలిసిన సినిమా మీద ప్రేమ ఉన్న ముగ్గురు వ్యక్తులు బాపిరాజు గారు, సునీల్ కుమార్ రెడ్డి గారు, రవీందర్ రెడ్డి గారు, ఈ అమ్మాయి బాగుంటుందని నాకు మొదటి సినిమా అవకాశం ఇచ్చారు. రాజు గాని సవాల్ మూవీ ట్రైలర్ లాంఛ్ కి మీరు వస్తారా అని బాపిరాజు గారు అడిగినప్పుడు తప్పకుండా వస్తా సార్ అని చెప్పాను. బాపిరాజు గారు సినిమాని రూపొందించడమే కాదు ప్రేక్షకుల దగ్గరకు రీచ్ అయ్యేలా చేస్తారు. "రాజు గాని సవాల్" టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. ఈ మూవీ రిలీజ్ కోసం నేను కూడా ఎదురుచూస్తున్నానని చెప్పుకొచ్చింది.
దామోదర ప్రసాద్ మాట్లాడుతు ఈ మధ్యే 'రాజు గాని సవాల్" టీజర్ చూసాను. చాలా బాగుంది. ఇప్పుడు ట్రైలర్ కూడా ఆకట్టుకుంది. ఈ సినిమా బాగుంటుందని మేము నమ్మకంగా ఉన్నాం ఎందుకంటే బాపిరాజు సెలక్షన్ అలా ఉంటుంది. ఎంతో బాగుంటే గానీ మూవీ రిలీజ్ చేయరు. బాపిరాజు గారికి ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను. ఈ సినిమాతో హీరో హీరోయిన్స్ తో పాటు మొత్తం టీమ్ అందరికీ మంచి గుర్తింపు, విజయం దక్కాలని కోరుకుంటున్నాను. మరో నిర్మాత ప్రసన్నకుమార్ మాట్లాడుతు 'రాజు గాని సవాల్" టైటిల్ చాలా పవర్ ఫుల్ గా ఉంది. కవాడిగూడ ఏరియాలో జరిగే కల్చరల్ ఈవెంట్స్ నేపథ్యంతో సాగే చిత్రమిది. ట్రైలర్ చూస్తే మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నట్లు తెలుస్తోంది. రవీందర్ తనే దర్శకుడిగా, నిర్మాతగా, హీరోగా ఈ మూవీ చేశాడు. ఆయన వెనక ఎంతో అనుభవం ఉన్న బాపిరాజు గారు ఉన్నారు. ఈ చిత్రానికి సపోర్ట్ చేసేందుకు హీరోయిన్స్ డింపుల్ హయతి, రాశీ సింగ్ రావడం సంతోషకరం. మూవీ మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను
హీరోయిన్ రాశీ సింగ్ మాట్లాడుతు ఈ ఈవెంట్ కు వచ్చే ముందే 'రాజు గాని సవాల్' సినిమా ట్రైలర్ చూశాను చాలా బాగుంది. ఇదొక ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా మూవీ. హీరో రవీందర్ గారితో పాటు రితిక, సంధ్య బాగా నటించారు. ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తున్న సందర్భంగా టీమ్ అందరికీ కంగ్రాట్స్ చెబుతున్నా. బాపిరాజు గారి నమ్మకాన్ని ఈ మూవీ నిలబెట్టాలి. "రాజు గాని సవాల్" సినిమా ఘన విజయాన్ని సాధిస్తుందని ఆశిస్తున్నాను.
నటుడు డాక్టర్ భద్రం మాట్లాడుతు 'రాజు గాని సవాల్' దర్శకత్వం, నిర్మాత, హీరోగా మూడు పాత్రలు పోషిస్తున్నారు రవీందర్ గారు. వీటిలో ఒక బాధ్యత నిర్వర్తించడమే కష్టం. ఈ సినిమాను బాపిరాజు గారు రిలీజ్ చేస్తున్నారంటే తప్పకుండా సక్సెస్ అయినట్లే. ఆయన ఈ మూవీ వెనక ఉండటమే ప్రధాన బలం. అందరితో స్నేహంగా ఉండే బాపిరాజు గారు లాంటి వ్యక్తం ఇండస్ట్రీలో ఉండటం మా అదృష్టం. ప్రేక్షకులంతా ఆగస్టు 8న థియేటర్స్ కు రావాలని, ఇలాంటి మంచి చిత్రాన్ని ఆదరించాలని కోరుతున్నాను..
హీరోయిన్ రితికా చక్రవర్తి మాట్లాడుతు 'రాజు గాని సవాల్" మూవీని ప్రతి ఒక్కరూ రిలేట్ చేసుకుంటారు. ఈ చిత్రం కోసం మేమంతా ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి పనిచేశాం. మా రవీందర్ గారు ఎంతో కష్టపడి మూవీ చేశారు. మేము మూవీ మీద భారీ అంచనాలు పెట్టుకోలేదు కానీ సినిమా తప్పకుండా అందరం హ్యాపీగా ఫీలయ్యే రిజల్ట్ ఇస్తుందని నమ్ముతున్నాం. ఆగస్టు 8న మా మూవీని థియేటర్స్ కు వెళ్లి చూడండి. మీ అందరి సపోర్ట్ మా మూవీకి ఉంటుందని నమ్ముతున్నాం. అన్నారు. నటి సంధ్య రాథోడ్ మాట్లాడుతు 'రాజు గాని సవాల్" మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ కు వచ్చిన అందరికీ థ్యాంక్స్. ఇది మాకొక ప్రత్యేకమైన సందర్భం. ఆగస్టు 8వ మా మూవీ రిలీజ్ కు వస్తోంది. చాలా ఎగ్జైటింగ్ గా ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నాం. ఈ చిత్రంలో నటించడం మా అందరికీ గ్రేట్ ఎక్సిపీరియన్స్ ఇచ్చింది. ఈ చిత్రానికి వర్క్ చేసిన వాళ్లంతా కొత్తవాళ్లే. మాకు ఈ సినిమా మంచి విజయాన్ని ఇస్తుందని ఆశిస్తున్నాం.
నటుడు రవీందర్ బొమ్మకంటి మాట్లాడుతూ - "రాజు గాని సవాల్" చిత్రంలో నేను విలన్ రోల్ చేశాను. ఈ సినిమాలో చాలా మంది కొత్తవాళ్లే నటించారు. వాళ్లకు ఈ చిత్రంతో మంచి బ్రేక్ వస్తుందని ఆశిస్తున్నా. ఈ సినిమాలో నటించే అవకాశం కల్పించిన హీరో రవీందర్ గారికి, బాపిరాజు గారికి థ్యాంక్స్. "రాజు గాని సవాల్" సినిమాను మీరంతా హిట్ చేస్తారని కోరుకుంటున్నా. అన్నారు.
దర్శక నిర్మాత, హీరో లెలిజాల రవీందర్ మాట్లాడుతూ - మా "రాజు గాని సవాల్" మూవీ ట్రైలర్ లాంఛ్ కు వచ్చిన పెద్దలు అందరికీ థ్యాంక్స్. ఇలాంటి పెద్దల మధ్య నా మూవీ ఈవెంట్ జరుపుకోవాలని కొన్నేళ్లుగా కలగంటున్నాను. అది ఈ రోజు నెరవేరడం హ్యాపీగా ఉంది. మా జీవితాల్లో జరిగిన కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ను ఆధారంగా చేసుకుని రూపొందించిన చిత్రమిది. సహజంగా ఉండేందుకు కవాడిగూడ రియల్ లొకేషన్స్ లో షూటింగ్ చేశాం. మధ్య తరగతి వారి జీవితంలో ఎన్నో సవాళ్లు ఉంటాయి. అలాంటి సందర్భంలో ఒక పెద్ద సమస్య ఎదురైతే ఆ మిడిల్ క్లాస్ పర్సన్ ఎలా ఎదుర్కొన్నాడు అనేది ఈ చిత్రంలో చూస్తారు. ఫ్యామిలీ బాండింగ్స్, స్నేహితుల మధ్య ఉండే అనుబంధాలను ఆకట్టుకునేలా తెరకెక్కించాం. సినిమా టెక్నికల్ గా క్వాలిటీగా ఉండాలని టాప్ టెక్నీషియన్స్ ను పెట్టుకున్నాం. యశ్వంత్ నాగ్ గారి మ్యూజిక్ లో రామ్ మిరియాల, అనురాగ్ కులకర్ణి, గోరటి వెంకన్న వంటి సింగర్స్ మా మూవీలో సాంగ్స్ పాడారు. ఈ సినిమా చూశాక మా టీమ్ కు కెప్టెన్ వంటి బాపిరాజు గారు "రాజు గాని సవాల్" సినిమా క్లాసిక్ డ్రామాగా మ్యూజికల్ హిట్ అవుతుందని చెప్పారు. ఆయన మాట నిజం కావాలని ఆశిస్తున్నా. అన్నారు.
నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ బాపిరాజు మాట్లాడుతూ - మా "రాజు గాని సవాల్" మూవీ ట్రైలర్ లాంఛ్ కు వచ్చి సపోర్ట్ చేస్తున్న పెద్దలందరికీ కృతజ్ఞతలు. ప్రసన్న కుమార్ గారు, దామోదర ప్రసాద్ గారు, తెలుగు ఫిలింఛాంబర్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్ గారు, డింపుల్ హయతి, రాశీ సింగ్, భద్రం గారు...ఇలా వీళ్లంతా నా మీద అభిమానంతో ఫోన్ లో మాట్లాడి అడగగానే వచ్చారు. ఇంతమంది అభిమానంతో మా వెనక నిలబడ్డారు. వారి బ్లెస్సింగ్స్ తో మా "రాజు గాని సవాల్" సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంది. ఘనంగా రిలీజ్ అయ్యి కాసుల వర్షం కురిపిస్తుందని నమ్ముతున్నాం. హీరో రవీందర్ గారు నా గురించి ఎంత చెప్పినా, ఆయన నాకు మూవీ ఇవ్వకుంటే ఈ రోజు ఈ వేదిక మీద నిలబడి మాట్లాడే అవకాశం వచ్చేది కాదు. రవీందర్ గారికి నా కృతజ్ఞతలు చెబుతున్నా. నా కెరీర్ ఈ స్థాయిలో ఉందంటే నా కుటుంబ సభ్యులైన మీడియా వారు కారణం. వాళ్లకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. అన్నారు.
గీత రచయిత గోరటి వెంకన్న మాట్లాడుతూ హీరో లెలిజాల రవీందర్ మంచి సంస్కారం ఉన్న వ్యక్తి. ఈ సినిమాలో పాటకు నేను రాసిన సాహిత్యం తగ్గట్టు పాడి సంగీతం ఇచ్చారు. అద్భుతంగా వుంది. పాట పిక్చరైజేషన్ కూడా చాలా బాగుంది. కమర్షియల్ అంశాలు ఈ సినిమాలో వున్నాయి. సినిమా సక్సెస్ కావాలి. ప్రజలు కూడా ఆశీర్వదించాలి అని అన్నారు.
నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ - "రాజు గాని సవాల్" సినిమాకు నిర్మాత, దర్శకుడే కాదు హీరోగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్న లెలిజాల రవీందర్ ను అభినందిస్తున్నాను. ఎవరో అవకాశం ఇస్తారని ఎదురుచూడకుండా తనే ధైర్యం చేసి ఈ సినిమా రూపొందించాడు. మంచి సినిమా చేయడమే కాదు ఆ చిత్రాన్ని ప్రేక్షకుల దగ్గరకు రీచ్ చేయాలి. అలా మూవీని ప్రమోట్ చేసి డిస్ట్రిబ్యూట్ చేయగల బాపిరాజు గారు రవీందర్ కు తోడవడం హ్యాపీగా ఉంది. దాదాపు 30 ఏళ్లుగా డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఉన్న బాపిరాజు గారు ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా రిలీజ్ చేస్తున్నారు. "రాజు గాని సవాల్" సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.
టెక్నీషియన్స్: డి ఓ పి: సోమ శేఖర్ కె, ప్రొడక్షన్ డిజైన్: అరవింద్ ములే, బ్యాక్ గ్రౌండ్ స్కోర్: మని జెన్న, స్క్రీన్ ప్లే: సాయి తేజ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పృథ్వీ తేజ్, సౌండ్ డిజైన్: సాయి మనీందర్ రెడ్డి, ఉదయ్ ఉప్పాల, లైన్ ప్రొడ్యూసర్: విన్సెంట్ ప్రవీణ్, మేకప్ అండ్ కాస్ట్యూమ్స్: పవన, లిరిసిస్ట్: గోరేటి వెంకన్న, రూపక్ రొనాల్డ్సన్, యశ్వంత్ నాగ్, గోపాలకృష్ణ శాఖాపూర్, సింగర్స్: రామ్ మిరియాల, అనురాగ్ కులకర్ణి, యశ్వంత్ నాగ్ , నిర్మాత, దర్శకత్వం : లెలిజాల రవీందర్

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
