రజినీకాంత్ 'పెద్దన్న' టీజర్.. ఉప్పెనరా..!
on Oct 23, 2021

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా శివ దర్శకత్వంలో రూపొందుతోన్న తమిళ సినిమా 'అన్నాత్తే'. ఈ సినిమాను తెలుగులో 'పెద్దన్న' తెలుగులో విడుదల చేయనున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ ను విక్టరీ వెంకటేష్ విడుదల చేశారు.
యాక్షన్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శివ.. రజనీ అభిమానులను మెప్పించేలా ఈ సినిమాను తీస్తున్నారని టీజర్ ని బట్టి అర్థమవుతోంది. రజనీ మార్క్ స్టైలిష్ యాక్షన్, శివ మార్క్ యాక్షన్ ఎపిసోడ్స్, పవర్ ఫుల్ డైలాగ్స్ తో టీజర్ అలరిస్తోంది. "పల్లెటూరు వాడిని శాంతంగానే చూసుంటావ్.. కోప్పడి చూడలేదు కదా. ఉప్పెనరా.. వాడికి అడ్డూ లేదు.. ఒడ్డూ లేదు" వంటి డైలాగ్స్ మెప్పిస్తున్నాయి. డి.ఇమ్మాన్ అందించిన సంగీతం టీజర్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాలో నయనతార, కీర్తి సురేష్, మీనా, ఖుష్బూ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దీపావళి కానుకగా నవంబరు 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



