వారికి రజనీకాంత్ ఫ్యాన్ క్లబ్ వార్నింగ్!
on Jan 5, 2021

సూపర్‌స్టార్ రజనీకాంత్ అభిమానులందరికీ ఆయన అధికార అభిమాన సంఘం రజనీ మక్కల్ మాండ్రమ్ గట్టి వార్నింగ్ ఇచ్చింది. జనవరి 10న వల్లువార్ తొట్టమ్ దగ్గర జరప తలపెట్టిన నిరసన ప్రదర్శనకు హాజరుకావద్దని పేర్కొంటూ ఓ లేఖను రాసింది. రాజకీయాల్లోకి రాకూడదని రజనీ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఆయన అభిమానుల్లో ఓ వర్గం ఆ ప్రదర్శనను తలపెట్టింది. ఆ ప్రదర్శనలో రజనీ మక్కల్ మాండ్రమ్ సభ్యులెవరైనా పాల్గొన్నట్లయితే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆ ఫ్యాన్ క్లబ్ తన లేఖలో హెచ్చరించింది.
తన ఆరోగ్య పరిస్థితి రీత్యా రాజకీయ పార్టీని ప్రారంభించడం లేదనీ, ఇప్పట్లో రాజకీయాల్లోకి రాలేని స్థితిలో ఉన్నాననీ, ఈ విషయంలో తనను క్షమించమనీ అభిమానులకు విజ్ఞప్తి చేస్తూ డిసెంబర్ 29న రజనీ తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ప్రకటించారు. హైబీపీతో బాధపడుతూ హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్స్‌లో చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చిన రెండు రోజుల తర్వాత ఆయన ఈ విషయం ప్రకటించారు. రాజకీయాల్లోకి రాకపోయినప్పటికీ ప్రజాసేవను కొనసాగిస్తానని ఆయన స్పష్టం చేశారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



